//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీకే మా ఓటు.. పులివెందుల ప్ర‌జ‌లు సంచ‌ల‌నం..!

Category : politics

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అడ్ర‌స్సును సైతం గ‌ల్లంతు చేయ‌డానికి టీడీపీ ఇప్పుడు ఒక మాస్ట‌ర్ స్కెచ్ వేసింద‌ని అంటున్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుటుంబం అన‌గానే గుర్తుకు వ‌చ్చేది పులివెందుల వైఎస్ఆర్ ముందుగా పులివెందుల‌లో చిన్న‌గా ఎదిగి.. ఆ త‌రువాత ఎమ్మెల్యే అయి జిల్లాల మీద జిల్లాల మీద ప‌ట్టుపెంచుకున్నాడు వైఎస్ఆర్‌. ఆయ‌న త‌ద‌న‌నంత‌రం ప్ర‌స్తుత ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పోటీ చేస్తూ వ‌స్తున్నారు. ఘ‌నంగా విజ‌యం సాధిస్తారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇడుపుల‌పాయ రిసార్ట్ త‌ప్ప .. క‌డ‌ప జిల్లా వ్యాప్తంగా ఎక్క‌డా కూడా అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్న‌ది ఆ జిల్లా వాసుల మాట‌. అలాంటి క‌డ‌ప నిరంత‌రం వివ‌క్ష‌కు గుర‌వుతూనే ఉంది. త‌న ఆరేడేళ్ల రాజ‌కీయ జీవితంలో త‌న తండ్రికి ఎక్క‌డా కూడా స‌రితూగ‌ను అని చెప్పే జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పులివెందుల ఉంచి పోటీ చేసి గెలిచినా.. అక్క‌డ‌కు వెళ్లిన సంద‌ర్భం ఒక్క‌టి కూడా లేదు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి. నిత్యం చంద్ర‌బాబును తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు.

జ‌రిగిన అభివృద్ధి కూడా జ‌ర‌గ‌లేదంటూ బుకాయిస్తుంటారు. ప్ర‌జ‌ల‌కు ఏమైనా మేలే జ‌రిగినా దానిని గుర్తించ‌క‌పోవ‌టాన్ని ఆయ‌న వంట‌బ‌ట్టించుకున్నారు. నాటి నుంచి నేటికీ అభివృద్ధికి నోచుకోని పులివెందులను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్ర‌బాబు కంక‌ణం క‌ట్టుకున్నారు. క‌డ‌ప‌లో ఇప్ప‌టికే ఎమ్మెల్సీ గెలుచుకున దూకుడు మీద ఉన్న టీడీపీకి ఏకంగా పులివెందుల కోట‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు నిశ్చ‌యించుకుంది. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న తాగు, సాగు నీటి స‌మ‌స్య‌ను చంద్ర‌బాబు ప‌రిష్క‌రించారు. ఇలా చంద్ర‌బాబు చేసిన అభివృద్ధిని చూసిన క‌డ‌ప ప్ర‌జ‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకే ఓటేసి గెలిపించుకుంటామ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు.