//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెళ్లిచూపులు షోతో యాంక‌ర్ ప్ర‌దీప్ కు కోలుకోలేని దెబ్బ‌..! ఎందుకో తెలుసా..?

Category : movies

మ‌న తెలుగులో బిగ్‌బాస్ త‌రువాత మ‌ళ్లీ అంత‌టి క్రేజ్‌తో దూసుకుపోతున్న షో ప్ర‌దీప్ పెళ్లి చూపులు. ఇక యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు వ‌రుడుగా మారేందుకు టెలివిజ‌న్ స్వ‌యం వ‌ర‌మే ఈ పెళ్లి చూపులు. అయితే, ప్రేక్ష‌కులు మాత్రం ఈ పెళ్లి చూపులు షోపై అసంతృప్తి వెల్ల‌గ‌క్కుతున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న పెళ్లికూతుళ్ల‌పై ఇప్ప‌టికే అనేక విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, ఈ షోపై సోస‌ల్ మీడియాలో భారీ ఎత్తున నెగిటివ్ ట్రోలింగ్ జ‌రుగింది. ఇంకా జ‌రుగుతూనే ఉంది. అయితే, ఈ షో ముగిసిన త‌రువాత ప్ర‌దీప్ మాచిరాజు ఎవ‌ర్నీ పెళ్లి చేసుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కేవ‌లం రెమ్యునరేష‌న్ కోసం ప్ర‌దీప్ ఈ షో చేసేందుకు ఒప్పుకున్నాడ‌న్న వార్త‌ల ఉవిన‌వ‌స్తున్నాయి.

అయితే, టెలివిజ‌న్‌లో స్వ‌యంవ‌రం రియాల్టీ షోలు గ‌తంలో చేదు అనుభ‌వాల‌ను మిగిల్చాయి. రాకేష్ రేవంత్ విష‌యంలో కానీ, రాహుల్ మహాజ‌న్ విష‌యంలో కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే, స్వ‌యంవ‌రం కార్య‌క్ర‌మం ద్వారా పెళ్లి చేసుకున్న రాకీ రాహుల్ తొంద‌ర్లోనే దాంప‌త్య జీవితానాకి గుడ్‌బై చెప్పే దాఖ‌లాలు ఉన్నాయి. ఇక త‌మిళ‌న‌టుడు ఆర్య కూడా అలాంటి ప్ర‌యోగాలు చేసిన‌ప్ప‌టికీ విఫ‌ల‌మ‌య్యాడు. అయితే, స్వ‌యం వ‌రం ప్ర‌క‌టించినా ఎవ‌ర్నీ పెళ్లి చేసుకోక‌పోవ‌డంతో వృథా ప్ర‌యాస‌గా మిగిలిపోయింది.

ఇక ఇవ‌న్నీ తెలిసినా.. ప్ర‌దీప్ మాత్రం త‌న‌కేమి ప‌ట్ట‌న‌ట్టు రెమ్యున‌రేష‌న్ కోసం పెళ్లిచూపులు షో చేసేందుకు రెడీ అయిపోయాడు. అయితే, ఈ షో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక అతి త్వ‌ర‌లోనే ముగిసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అంతేకాక‌, ఈ షోపై నెటిజ‌న్లు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మీ పెళ్లి చూపుల ప్రోగ్రామ్ చాలా విసుగు పుట్టించేలా ఉంది. దీనికి బ‌దులు తెలుగు వ‌ర్ష‌న్‌లో క‌త్రోంకా... కిలాడీ షోలు చేప‌డితే బాగుండు. ఇదంతా నాన్సెన్స్‌. పెఝ‌ళ్లి చూపులు చాలా చెత్త‌గా ఉన్నాయి. ప్ర‌దీప్ మాచిరాజు ఎక్క‌డా లేనంత హైప్ ఇచ్చాడు.. ఈ కార్య‌క్ర‌మం చూస్తుంటే త‌ప్పుడు సంకేతాలు అందిన‌ట్టు క‌నిపిస్తుంది. ఈ షోలో పాల్గొన్న పెళ్లికూతుర్లంద‌రూ ఫేక్. వారంద‌ర్నీ డ‌బ్బులు ఇచ్చి తెచ్చిన‌ట్టు అనిపిస్తుందని నెటిజ‌న్లు కామెంట్ చేశారు. ఇలా ప్రేక్ష‌కుల విమ‌ర్శ‌ల‌తో నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది ప్ర‌దీప్ పెళ్లి చూపులు.