Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరో ప్రాణం తీసిన పబ్జీ ... మొన్న ముంబై లో నేడు సిద్దిపేటలో ఘటన

Category : technology state

పబ్జీ గేమ్ యువత ప్రాణాలతో చెలగాటమాడుతుంది. పబ్జీ గేమ్ ఆడవద్దని తల్లిదండ్రులు మందలించారని మనస్థాపానికి గురైన ఒక యువకుడు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో జరిగిన ఈ ఘటన యువత ఎంత గా ఈ పబ్జీ గేమ్ కు బానిసలుగా మారుతున్నారో తేటతెల్లం చేస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పబ్జీ గేమ్.. యువతను బానిసలుగా మారుస్తున్న గేమ్ ఇది.

ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులు ఈ గేమ్ మత్తులో పడిపోతున్నారు. ఎప్పుడూ చేతిలో సెల్ పట్టుకుని పిచ్చి వాళ్లలా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు తల్లిదండ్రులు గట్టిగా మందలిస్తే పబ్జీ మోజులో పడి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న ముంబై లో పబ్జీ ఆదుకునేందుకు ఫోన్ అడిగితే కొనివ్వలేదని ప్రాణం తీసుకున్న యువకుడి ఉదంతం మరచిపోకముందే, తాజాగా ఇదే గేమ్‌కు బానిసలా మారిన మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో చోటు చేసుకుంది .

మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మల్లాపూర్‌కు చెందిన శేషత్వం వెంకటనారాయణ- శారద దంపతుల చిన్న కుమారుడు సాయిచరణ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతడు కొన్ని రోజులుగా పబ్జీ గేమ్‌కు అలవాటు పడి చదువును నిర్ణక్ష్యం చేస్తున్నాడు. గమనించిన తల్లిదండ్రలు అతడిని మందలించారు. అయినా, అతడు వారి మాటను వినలేదు. దీంతో గేమ్ ఆడవద్దంటూ గట్టిగా చెప్పారు. దీంతో మనస్థాపానికి గురైన సాయిచరణ్.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కొడుకు గదిలో ఏం చేస్తున్నాడోనన్న అనుమానంతో వచ్చి చూసే సరికి సాయిచరణ్ ఫ్యాన్‌కు వెలాడుతూ కనిపించాడు. పక్కింటి వారి సాయంతో తలుపులు పగలకొట్టి అతడిని బయటికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే సాయిచరణ్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పబ్జీ గేమ్ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న యువకుడు నవ మాలు నవమాసాలు మోసీ , కనీ, ఇంతకాలం పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.

Related News