Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే..ఆ యువకుడు ఏమి చేశాడో తెలుసా ?

Posted a month ago | Category : national

అమాయకురాలైన అమ్మాయి పై ప్రేమోన్మాది దాడి, కామపిశాచి ఘాతుకం, ప్రేమ తిరస్కరించిందని అమ్మాయి పై యాసిడ్ దాడి అంటూ మనం నిత్యం మీడియాలో చూస్తూనే ఉంటాం. అదే అమ్మాయి మోసం చేసిందని విద్యార్ధి ఆత్మహత్య అనే వార్తలు మాత్రం రావడం అరుదు అంటే అలాంటివి జరగడం లేదా అంటే అదేం లేదు రోజుకొక ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. కాని ఇక్కడ మీడియా చూపిస్తుంది మాతరం కచ్చితంగా పక్షపాతమే.

మనసు చిన్న బోతే సర్దు బాటు చేయడం... అంతులేని ఆశలతో కుప్పకూలితే చేయూతనిచ్చి లేపి నిలబెట్టడం.. ఆ యువకుడి బాధ్యతలు. మానసిక వైద్యుడిగా అదే అతని కర్తవ్యం కూడా. అటువంటి వ్యక్తి ప్రేమ వలలో చిక్కుకున్నాడు. విలాసాలతో ప్రియురాలిని మురిపించడానికి తనకు నిత్యావసరాలైన వస్తువులన్నీ అమ్ముకున్నాడు. తన సొంతమనుకున్న ఆమె, పరాయిదయ్యిందని తెలిసి విలవిల్లాడిపోయాడు. పోలీసులు అతని గది పగులగొట్టి చూసినప్పుడు ఓ చిన్నపాటి పెట్టెకు సరిపడా డిప్రెషన్‌కు వాడే మందులు బయటపడ్డాయి.

కుప్పంలోని పీఈఎస్‌ వైద్య కళాశాలలో రెండు రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వైభవ్‌దేవ్‌ అదే కళాశాలలో సైకాలజీ పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన వైభవ్‌, కళాశాలలో చేరినప్పుడు అందరిలాంటి విద్యార్థే. లక్షలాది రూపాయలు పోసి మరీ తల్లిదండ్రులు అతడిని ఈ కళాశాలలో పీజీ కోర్సులో చేర్పించారు. వారి కలలు, పెద్ద మానసిక వైద్యుడు కావాలనే తన ఆశయాలు నెరవేర్చు కోవాలనే లక్ష్యంతోనే వైభవ్‌ కళాశాలలో అడుగు పెట్టాడు.

ఒక అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చదువు మూలనపడింది. తరగతి గదులు, పాఠాలకంటే. అమ్మాయితో కలిసి విలాసాలే ఎక్కువగా అనిపించాయి. తల్లిదండ్రులు ఎప్పటిలాగే ఖర్చులకు ప్రతి నెలా పంపే డబ్బులు చాలకుండా పోయాయి. అదనంగా డబ్బులు పంపమని రెండుమూడు సార్లు అమ్మానాన్నలకు ఫోన్లు చేశాడు కానీ. వారినుంచీ చీవాట్లు తప్ప పైసా రాలలేదు. ఇటు విలాసాల కోసం అమ్మాయి ఒత్తిడి. తన చదువుకు ఉపయోగపడే ల్యాప్‌ ట్యాప్‌, బైక్‌లు అమ్మి విలాసాలకు ఖర్చుపెట్టాడు. జీవితం ‘జల్సా’గా సాగుతుండగా.. హఠాత్తు పరిణామ ఎదురైంది.

తాను ప్రేమిస్తున్న అమ్మాయి మరో అబ్బాయితో తిరుగుతోందన్న నిజాన్ని తట్టుకోలేక పోయాడు. ఇంతలో విలాసాలకు ఖర్చు పెట్టేందుకు చేతిలో డబ్బు లేకుండా పోయింది. అమ్మాయి ముందు తేలికైపోయాడు. తల్లిదండ్రుల ఎదుట పనికిరాని కొడుకుగా ముద్ర పడ్డాడు. చదువుల్లోనూ వెనుక బడ్డాడు. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అతని గదిలో బయటపడ్డ గుట్టల కొద్దీ డిప్రెషన్‌ మందులే అతని మానసిక దైన్యానికి సాక్ష్యమిస్తున్నాయి. చివరకు తల్లిదండ్రులకు ఉత్తరం కూడా రాయలేని స్థితిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని నిండు ప్రాణాలు తీసుకున్నాడు.

చావొక్కటే దారి కాదు :

కొడుకు మృత దేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు కుళ్లికుళ్లి ఏడుస్తున్న ఆ తండ్రి శోకం చెప్పలేనిది. జీవితమనేది మనదొక్కరిదే కాదు, మనల్ని కని, పెంచి, పోషిస్తున్న అమ్మానాన్నలది కూడా. మనమీద మనకెంత హక్కుందో తల్లిదండ్రులకూ అంతే హక్కుంది. యుక్త వయసు విపరీతాలకు లోనవడం సహజం. అయితే నిరంతరం మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రేమైనా, విలాసాలైనా కాస్త ఆగి, ఆలోచించి అందులోని మంచిచెడులను సరిచేసుకుంటూ వెళ్ళాలే కాని ఆత్మహత్యకు పాల్పడకూడదు.

మనకు తెలియకపోతే కనీసం స్నేహితులతో పంచుకొని వారి సలహాలు తీసుకోవాలి. చస్తే ఏమివస్తుంది భూడిద తప్పు... మనల్ని అపహాస్యం చేసిన వారిని సవాలు చేస్తూ- పైకి.. పైపైకి ఎదుగుతూ బ్రతికి చూపించాలి. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలి తప్పా పిరికివాడిలా హ్యాత్మహత్యలు చేసుకోడదు. మిత్రులారా దయ చేసి ఒక్క సారి హ్యాత్మహత్య చేసుకొనే ముందు ఆలోచించండి....నిన్ను కని పెంచిన తల్లిదండ్రులను, నీ తోబుట్టువులు గురించి, నీ చిన్ననాటి మిత్రుల గురించి ఆలోచించండి మిత్రులారా.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 2 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే