//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గర్ల్స్ హాస్టల్ లో సైకో అర్ధరాత్రి వీరంగం !

Category : state

ఒంగోలులోని గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలోకి అర్థరాత్రి చొరబడి హలచల్‌ చేస్తూ విద్యార్థినులను భయపెట్టాడు ఓ సైకో కేవలం విద్యార్ధులనే కాక అక్కడున్న వారందరినీ బెదిరించాడు.

పరీక్షల కోసం అర్థరాత్రి వరకు చదువుతున్న బాలికలు సైకో వీరంగంతో భయభ్రాంతులయ్యారు.. వివరాల లోకి వెళితే ఒంగోలులో టూ టవున్ పోలీస్ స్టేషన్‌కి దగ్గరలోనే గిరిజన కళాశాల బాలికల వసతి గృహం ఉంది. 35 మంది గిరిజన విద్యార్థినులు ఈ వసతి గృహంలో ఉంటున్నారు. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థినులు అర్థరాత్రి వరకు చదువుకుంటున్నారు.

ఆ సమయంలో గోడ దూకి వసతి గృహంలోకి వచ్చిన ఒక సైకోబెదిరింపులకు దిగాడు. దీంతో తమను కాపాడండి అంటూ పెద్ద పెద్దగా కేకలు పెట్టారు. కొంతమంది బాలికలు ధైర్యం చేసి.. 100 నెంబర్‌కు డయల్‌ చేశారు.. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సైకోని అరెస్ట్‌ చేశారు.. రోడ్డు మీదే వసతి గృహం ఉండటంతో పాటు గోడ ఎత్తుగా లేకపోవడంతో ఆకతాయిలతో పాటు ఇటువంటి సైకోలు రెచ్చిపోతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.