//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరికాసేపట్లో పీఎస్‌ఎల్వీ-సీ 43 ప్రయోగం

Category : national state

భూ పరిశీలన ఉపగ్రహమైన హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ (హైసిస్)తోపాటు మరో 30 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లే పీఎస్‌ఎల్వీ-సీ43 వాహకనౌక ప్రయోగానికి 28 గంటల కౌంట్‌డౌన్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఉదయం 9.58 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.

ఈ మేరకు పీఎస్4 (నాలుగో దశ) ఇంధనం నింపడం సహా అన్ని పనులు పూర్తయినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అధికారులు వెల్లడించారు. పీఎస్‌ఎల్వీ-సీ43 మిషన్‌లో ప్రధాన ఉపగ్రహం అయిన హైసిస్‌ను ఇస్రో అభివృద్ధి చేసింది. 380 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని.. భూమికి 636 కి.మీ. ఎత్తులో ఉన్న పోలార్ సన్ సింక్రొనస్ ఆర్బిట్‌లో 97.957 డిగ్రీల ఒంపు వద్ద ప్రవేశపెడతారు.

ఈ మిషన్ జీవితకాలం ఐదేండ్లు. భూమి విద్యుదయస్కాంత క్షేత్రంలోని చిన్న చిన్న తరంగదైర్ఘ్య పరారుణ ప్రాంతాలను, పరారుణ ప్రాంతంలో కనిపించే భూ ఉపరితలాన్ని పరిశీలించడం హైసిస్ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం. హైసిస్‌తోపాటు పీఎస్‌ఎల్వీ-సీ43 మోసుకెళ్తున్న 30 ఉపగ్రహాల్లో ఎనిమిది దేశాలకు చెందిన 1 మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ వాణిజ్య ఉప్రగ్రహాలను 504 కి.మీ ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు

Related News