//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీనేత కి బారి ఆస్తి నష్టం...

Category : politics

విజయవాడలో, పటమట దగ్గరలో బారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది, వైఎస్సార్‌ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవికి సంబంధించిన గోడౌన్‌ అని తెలుస్తుంది. పటమట డొంకరోడ్డులోని ఉన్న ఈ గోడౌన్‌లో ఆచంట గౌతమ్‌ అనే వ్యక్తి పెళ్లిళ్లలకు కావాల్సిన డెకరేషన్‌ సమానును ఉంచాడు. నిన్న జరిగిన అగ్నిప్రమాదాలో అవన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి.

నిన్నసాయంత్రం 6 గంటలకు జరిగింది ఈ సంఘటన. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న డెకరేషన్‌ సామగ్రి అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.40 లక్షల ఆస్థి నష్టం సంభవించిందని అని గౌతమ్‌ వివరించాడు. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ ఎవరో కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు.

ఈ అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న ఫైర్‌ ఆఫీసర్‌ కె.వి.మురళీ కొండ బాబు ఆధ్వర్యంలో రెండు ఫైర్‌ వాహనాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఫైర్‌ సిబ్బంది మాట్లాడుతూ ఫైబర్‌ ప్లాస్ట్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారైన మెటీరియల్‌ వల్ల లోపల వస్తువులు అగ్నికి మాడిపోయాయని అన్నారు.

Related News