//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్కడ నమాజ్‌ను నిషేధించం‍డి

Category : national

ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన అద్భుత కట్టడం తాజ్‌ మహల్‌ చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్‌మహల్‌ను తొలగించడంతో మొదలైన వివాదం.. బీజేపీ ఎమ్మేల్యే సంగీత్‌ సోమ్‌ చేసిన వ్యాఖ్యలతో మరో మలుపు తీసుకుంది. అదే సమయంలో తాజ్‌ మహల్‌ ఒకప్పటి శివాలయం అంటూ ఎంపీ వినయ్‌ కతియార్‌ చేసిన మరో వ్యాఖ్య వివాదాన్ని మరింత పెంచింది. అప్పటినుంచి తాజ్‌ చుట్టూ వివాదాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి.తాజాగా రాష్ట్రీయ స్వయక్‌ సేవక్‌ సంస్థ (ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ ఇతిమాస్‌ సంకల్ప సమితి (ఏకేబీఐఎస్‌ఎస్‌) సంస్థ ఒకటి తాజ్‌ దగ్గర ముస్లిం మత ప్రార్థనలను నిషేధిం‍చాలని డిమాండ్‌ చేసింది.