//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కంప్యూటర్ ప్రోగ్రామర్లు H1B వీసాకు అనర్హులు

Category : national

H1B వీసా విధివిధానాలపై మార్పులు చేర్పులు చేయటానికి ట్రంప్ ప్రభుత్వం కొద్ది కాలంగా ప్రయత్నిస్తుంది. మార్చి 31న ఒక కొత్త పాలసీ మెమోరాండంను విడుదల చేసింది. దీని ప్రకారం కంప్యూటర్ ప్రోగ్రామర్లు ఇదివరకటిలా H1B వీసాకు యకాయకిన అర్హత పొందరు. యూస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సంస్థ అంతకుముందు అమలులోఉన్న మెమో "డిసెంబర్ 22,2000 H1B ఉద్యోగాల ఎంపికపై మార్గదర్శకాలను" రద్దు చేస్తూ ఒక పాలసీ మెమోను విడుదల చేసింది. అంతకు ముందు అందరు ప్రోగ్రామర్ల ముఖ్య విధి కంప్యూటర్ కోడు రాయడం, దానిని పరీక్షించడం అని, అందువలన వారు స్పెషాలిటీ వృత్తినైపుణ్యాలు కలవారిగా H1B వీసాకు అర్హత కలిగి ఉండేవారు. USCIS ఈ అర్హతను రద్దు చేసింది. కొత్త మెమో ప్రకారం ఎవరైనా కంప్యూటర్ ప్రోగ్రామర్ ను ఉద్యోగం లో నియమించి, అతని IT నైపుణ్యం కంపెనీ అభివృద్ధికి తోడ్పడినంత మాత్రానా అతని ఉద్యోగం ప్రత్యేకమైందిగా గుర్తింపుబడదని పేర్కొన్నది. దీని మూలంగా కొన్ని రకాల ప్రోగ్రామర్ల ఉద్యోగాలు ఇకపై H1B కి అర్హత కలిగి ఉండబోవు. నాస్ కామ్ నిపుణులు ఈ మెమో ప్రభావం భారతీయ IT నిపుణులకు ఎంత నష్టం చేకూర్చనున్నదన్న విషయంపై విశ్లేషిస్తున్నారు. 

ఈ మెమో క్రింది స్థాయి ప్రోగ్రామింగ్ ఉద్యోగాలకు స్వస్తిపలకనుందని తెలిపారు. కాకపోతే మన IT సంస్థలు ఎంట్రీ లెవెల్ H1B వీసాలకు దరఖాస్తులు చేయవని, ఎంతో నైపుణ్యం ఉన్న వారికే H1B వీసాలను సాధిస్తాయి కనుక ఈ మెమో మన కంపెనీలకు అంత నష్టం కలిగించిందని నాస్ కామ్ నిపుణుల అభిప్రాయం. స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే అమెరికా యూనివర్సిటీలలో డిగ్రీ చేసిన వారికి, లేదా వారికి సరితూగే అర్హత కలవారికి మాత్రమే ఉండే ఉద్యోగాలని కొత్త మెమో సారాంశం. కానీ ఇప్పటికే డిగ్రీకి తక్కువ నైపుణ్యం కలవారికి H1B వీసాలు మంజూరు చేయడం లేదు. కాకపోతే దీని మూలంగా ఎంత నష్టం కలగనున్నదో వేచి చూడవలసి ఉంటుంది.