//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'ప్లాస్టిక్‌ ప్లాస్టిక్‌' సంచికను ప్రారంభించిన ప్రొఫెసర్‌ రాజమణి..!

Category : national

పుట్టిన రోజు వేడుకలంటే సాధారణంగా గుర్తు కొచ్చేది కేక్‌ కటింగ్‌. ఆ రోజంతా స్నేహితులు, బంధువులతో సరదాగా గడపాలనుకుంటారు. మరికొందరైతే ఏదో అనాథ శరణాలయంలోనో, వృద్ధాశ్రమంలోనో బర్త్‌డే జరుపుకోవడానికి మొగ్గు చూపుతారు. కానీ, వీటన్నింటికీ భిన్నంగా కర్ణాటకకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్‌ రాజమణి తన కూతురి పుట్టిన రోజు వేడుకలను జరిపారు. ప్లాస్టిక్‌ వాడకానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ముద్రించి చుట్టుపక్కల వారికి పంచిపెట్టాడు. అంతేకాకుండా ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ఆయన నడుపుతున్న 'ప్లాస్టిక్‌ ప్లాస్టిక్‌' సంచికను పునర్‌ ముద్రించారు. తద్వారా ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం అతడికి కొత్తేం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టిక్‌ వాడకానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమిస్తూనే ఉన్నారు. పర్యావరణాన్ని సంరక్షించడానికి వివిధ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ప్లకార్డులు పంచిపెట్టడం ఆయన ఎంచుకున్న సరికొత్త విధానం.

7000 కాపీలు ఉచితంగా.. ప్రొఫెసర్‌ రాజమణి ఆరేళ్ల క్రితం 'ప్లాస్టిక్‌ ప్లాస్టిక్‌' సంచికను ప్రారంభించారు. దీని సర్క్యులేషన్‌ కేవలం 2000 మాత్రమే. కానీ, మరో 7000 కాపీలను ఉడిపి, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో ఆయన ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా ఈ పత్రిక అందరికీ అందుబాటులో ఉండాలనే కారణంగా కేవలం రూ.5కే విక్రయిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను గురించి వివరించడమే ఈ సంచిక ముఖ్యోద్దేశం. వివిధ పాఠశాలలు, కళాలశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ' ఇటీవల కాలంలో ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిపోయింది. డంపింగ్‌ యార్డులు, రోడ్డు పక్క చెత్తకుప్పల్లో దాదాపు 60 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉంటున్నాయి. దీంతో నాకు చాలా బాధనిపించింది.

14 ఏళ్ల క్రితం నేను ఓ ఇల్లు కట్టుకున్నాను. దాని పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ తవ్వినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే బయటపడుతున్నాయి. ప్లాస్టిక్‌ వల్ల నేల, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను' అని అంటున్నారు ఈ పర్యావరణ ప్రేమికుడు.