//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శబరిమల ఆలయంలోకి మహిళలు

Category : national state

దేశంలో పలు ఆలయాల్లో మహిళలకు ప్రవేశం లేని సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో కొన్నిచోట్ల ఈ విషయంలో పెద్ద రగడే జరిగింది.పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి యాభై ఏళ్ల లోపు ఉన్న మహిళలు ప్రవేశించారన్న వార్తలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. కొంతమంది యువతులు ఆలయంలో పూజలు చేస్తున్న ఫొటోలు నెట్ లో వైరల్ గా మారాయి. కొల్లాంకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుటుంబ సమేతంగా శబరిమలకు వచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. నిబంధనలను అతిక్రమించి మహిళలు ఆలయంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.

Related News