Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ పై ప్రియాంక గాంధి పోటీనా ...? అదే జ‌రిగితే గెలిచేది ఎవ‌రు ...?

Category : national politics

ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల‌లో ప్ర‌ధానంగా న‌డుస్తున్న చ‌ర్చ మోడీ పై ప్రియంక గాంధీ పోటీ చేయ‌డం ....? అయితే ప్రియాంక గాంధీ మోడీ పై పోటీ చేస్తే గెలుస్తుందా ....? ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఎన్ని పార్టీలు విజ‌యాన్ని అందుకున్నాయి ...? అంటూ ఇప్పుడు చ‌ర్చ ప్ర‌ధాన చ‌ర్చ న‌డుస్తుంది ....గ‌త ఎన్నిక‌ల‌లో మోడీ వార‌ణాసి నుండి పోటీ చేసి 3ల‌క్ష‌ల భారీ మెజార్టీతో గెలుపోందారు. ప్ర‌స్తుతం కూడా మోడీ ఇదే నియోజ‌క వ‌ర్గం నుండి పోటీ చేస్తున్నారు.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు భాగానే ఉంది కానీ ...ప్రియాంక గాంధీ ఈ మ‌ధ్య కాశీ యాత్ర ప్రారంభించిన‌ప్పుడు అక్క‌డ మూడు రోజులు గంగా యాత్ర చేసింది .ఆ స‌మ‌యంలో ఒక మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వులో ..మీరు అమేథి నుండి పోటీ చేస్తారా, రాయ్ బ‌రేలీ నుండి పోటీ చేస్తారా అనే ప్ర‌శ్న ఎదుర‌వ‌డంతో ప్రియాంకా గాంధీ వార‌ణాసి నుండి ఎందుకు పోటీ చేయోద్ద‌ని బ‌దులిచ్చింది .దాంతో ప్రియాంక గాంధీ మోడీ పై పోటీ చేస్తుందనే విష‌యం దేశ రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌న‌యాంశంగా మారింది .

అయితే వార‌ణాసిలో అత్య‌ధిక ఓట‌ర్లు హిందువులే కావ‌డంతో పాటు ,న‌రేంద్ర మోడీ దేశ ప్ర‌ధానిగా ఉడ‌డంతో ఎక్కువ శాతం ఓట‌ర్లు మోడీ పై మ‌క్కువ చూపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇంట‌లీ జేన్స్ నుండి రిపోర్టులు అందుతున్నాయి .కానీ .. ప్రియాంక గాంధీ పోటీ చేస్తే ఆ రిపోర్టులు తారుమారు అయ్యే చాన్సులు చాలా ఉన్నాయ‌ని కాంగ్రెస్ నాయ‌కుల నుండి వాద‌న‌లు వినిపిస్తున్నాయి.హిందువులు ఎక్కువ‌గా ఉన్న వార‌ణాసిలో మైనార్టీల‌కు ప్రాధాన్య‌త‌ను ఇచ్చే కాంగ్రెస్ పార్టీ త‌రుపున ప్రియాంక గాంధీ పోటీ చేయ‌డం మైన‌సే అవుతుందిని రాజ‌కీయ పండితులు అంటున్నారు.

దానికి తోడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు వార‌ణాసి అభివృద్ధిని ఆ పార్టీ నాయ‌కులు ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి .కాబ‌ట్టీ ఇలాంటి త‌రుణంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తే గెలిచే అవ‌కాశాలు త‌క్కువ అనే చేప్పాలి .ఒక వేళ ప్రియాంక గాంధీ మోడీ పై పోటీ చేస్తే మాత్రం దేశంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌న‌టువంటి అతి పెద్ద పోటీగా ఈ అంశాన్ని ప్ర‌స్తావించే చాన్సు ఉన్న‌ట్లు రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.

Related News