Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గాడిదలు రాసే చెత్త కథనాలను నేను పట్టించుకోను :ప్రియాంక చోప్రా

Category : movies

ప్రియాంక చోప్రా , నిక్ తాజాగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంగరంగవైభవంగా వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇంకా పెళ్లి మూడ్ లో నుంచి బయటికి రాకముందే వీళ్ళ పై న్యూ యార్క్ కి చెందిని ది కట్ మ్యాగజిన్ ఒక కధనం ప్రచురించిన సంగతి తెలిసిందే.

అయితే దాని పై విమర్శలు కూడా గట్టిగ వచ్చాయి దాంతో ది కట్ సంస్థ స్వయంగా క్షమాపణ చెపుతూ ఆ కధనాన్ని తొలిగించింది. అయినప్పటికీ ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ కధనం పై తాజాగా ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు. ఆమె మాట్లాడుతూ..... నా కూతురు తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

ఆమె ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంది. కొత్త వధూవరులతో పాటు తమ కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి సమయంలో కొన్ని కథనాలు మమ్ములను ఏమాత్రం డిస్ట్రబ్ చేయలేవు అంది. కొంత మంది ఫూల్స్ రాసిన కథనాల గురించి మేము పట్టించుకోవాలని భావించడం లేదు.

వారు రాసిన వాటికి పబ్లిసిటీ ఇవ్వాలనుకోవడం లేదు. చెత్త పనులు చేసే గాడిదలు ఉంటాయి. ఆ గాడిదల అరుపులు పట్టించుకోం అంటూ మధు చోప్రా అన్నారు. ఈ వార్తలపై ప్రియాంక చోప్రా కూడా స్పందించి అలాంటి వార్తలను తాను పెద్దగా పట్టించుకోనంటూ ప్రకటించింది. మరి ఊహాగానాలతో కూడిన తప్పుడు కధనాలు ఎప్పుడికి ఆగుతాయో.

Related News