Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రియమణి హీరోయిన్ గా 'సిరివెన్నెల'....ఫుల్ లెంగ్త్ థ్రిల్లర్

Category : movies

యమదొంగ,రగడ,గోలీమార్ వంటి చిత్రాలలో హీరోయిన్ మెరిసిన భామ ప్రియమణి.కెరియర్ ఆరంభంలో కథానాయికగా ఆడిపాడిన ఆమె, ఆ తరువాత లేడి ఓరియెంటెడ్ గా 'క్షేత్రం' .. 'చారులత' వంటి సినిమాలలో కూడా ప్రధాన పాత్రధారిగా అదరగొట్టేసింది.కొత్త కథానాయికల పోటీ కారణంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

గత కొంత కాలంగా సరైన హీరోయిన్ వేషాలు రాకపోవడంతో నిరాశ చెందిన ఈ అమ్మడు ..... ఆ తరువాత టెలివిజన్ రంగంలో తన హస్త వాసి చూసుకుంది .. తాజాగా మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయిపోయింది. ప్రస్తతం ప్రియమణి ప్రధాన పాత్రధారిగా ఒక సినిమా రాబోతుంది.

... ఆ సినిమా పేరే 'సిరివెన్నెల'.

రామసీత - బాషా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇటీవలే టాకీపార్టును పూర్తి చేసుకుంది .. రెండు పాటలు మాత్రమే చిత్రీకరించవలసి వుంది. పులిజాల ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, థ్రిల్లర్ జోనర్లో సాగేదే అయినప్పటికీ, కుటుంబ సమేతంగా చూడదగినదిగా ఉంటుందని అంటున్నారు. 'కాలకేయ' ప్రభాకర్ ప్రధానమైన విలన్ గా నటించిన ఈ సినిమాలో, రాజేంద్ర ప్రసాద్ మనవరాలు మహానటి .. చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

Related News