//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దయా తో జతకట్టనున్న ప్రియా....!

Category : movies

ఒక్క సీన్‌తో ‘కన్నుకొట్టి’ కుర్రకారును తనవైపు తిప్పుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా అందరూ ఈ భామకు ఫిదా అయిపోయారు.ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సింబా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మాత.

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమాలో రణ్‌వీర్‌కు జోడీగా ప్రియా ప్రకాశ్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె పాత్ర పెద్దగా ఏమీ ఉండదని సినీ వర్గాల సమాచారం.ఈమెను బాలీవుడ్‌కి పరిచయం చేయాలని కరణ్ జోహార్ భావిస్తున్నారని టాక్. మరోవైపు దర్శకుడు రోహిత్ శెట్టి కూడా దక్షిణాది హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు కాబట్టి ఇప్పుడు మళ్లీ ఓ దక్షిణాది సినిమాకు రీమేక్‌గా వస్తోన్న ‘సింబా’లో కూడా ఇక్కడి హీరోయిన్‌నే తీసుకునే అవకాశముందని కూడా అంటున్నారు.

ఇంతకీ ప్రియా ప్రకాశ్ ఈ సినిమాలో ఉందా ఉంటే హీరోయిన్ పాత్ర ఇస్తున్నారా? లేదంటే ఆమె కోసమే ప్రత్యేకంగా ఏదైనా పాత్రను సృష్టిస్తున్నారా? లాంటి విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ‘సింబా’ను ఈ ఏడాది డిసెంబర్ 28 విడుదల చేయాలని చూస్తున్నారు.

Related News