//single page style gallary page

Prince Mahesh Babu Title Sentiments

Category : movies

Click here to read this article in Telugu

టైటిల్ సెంటిమెంట్ పై నమ్మకం పెట్టుకున్న మహేష్ బాబు....దీని అనిల్ ఒప్పుకుంటాడా... లేదా ...?

ప్రిన్స్ మ‌హేష్‌బాబు ప్రస్తుతం మహర్షి సక్సెస్ సంబరాల్లో తెగ బిజీగా ఉన్నారు. కేవ‌లం 4 రోజుల‌కే 100 కోట్ల పైగా గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు 70 కోట్ల షేర్ కొల్ల‌గొట్టిన మ‌హ‌ర్షి 110 కోట్ల షేర్ దిశ‌గా దూసుకుపోతోంది. నైజాంలో అయితే కేవ‌లం 6 రోజుల‌కే 22 కోట్ల షేర్ రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌కు సైతం ఆశ్చర్యానికి గురి చేసింది . ఇలా ప్రస్తుతం ఈ సినిమా స‌క్సెస్‌ను పిచ్చ‌పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తోన్న మ‌హేష్ .తాజాగా తన 26వ సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు. ఇప్పటికే టాలీవుడ్లో నాలుగు వ‌రుస హిట్ల‌తో టాప్ మోస్ట్ డైరెక్ట‌ర్‌గా సూపర్ ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం వ‌చ్చే నెల‌లో ఈ సినిమా లాంచ్ ఉంటుంద‌ని.. జూలై నుంచి కంటిన్యూగా జ‌రిగే షెడ్యూల్‌తో ఈ సినిమా కంప్లీట్ అవుతుంద‌ని అంతా అంటున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ గురించి ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎక్కువ సెంటిమెంట్ల కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉండడం సర్వ సాధారణం.అయితే మహేష్ బాబు కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి.అది కూడా తన సినిమా టైటిల్స్ విషయంలో.. ఈ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి కి ఈ పెద్దగా సెంటిమెంట్లు అయితే ఫాలో కాడు. కథ ఎలాంటి టైటిల్ సూచిస్తుందో ..? దానినే టైటిల్ గా ఫాలో అవుతాడు. మహేష్ ఎక్కువుగా మూడు అక్షరాలు ఉన్న టైటిల్స్ నే ఎక్కువుగా ఎంచుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం మహేష్ అనిల్ కు ఓ రిక్వెస్ట్ పెట్టినట్టు టాక్.తనకు మూడు అక్షరాల టైటిల్ అచ్చి వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా కి కూడా మూడు అక్షరాల టైటిల్ పెట్టాలని సూచించాడట. ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది అని మహేష్ మంచి ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే మూడు అక్షరాల టైటిల్స్ మహేష్ కు సూపర్ హిట్లు ఇచ్చాయ్... సూపర్ ప్లాప్స్ కూడా ఇచ్చాయ్. తాజాగా మహర్షి కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టుకు అదే సెంటిమెంట్ ఫాలో అయితే ఏం జరుగుతుంది ....? అన్నది చూడాలి.

Prince Mahesh Babu is currently busy with the Tribe in Maharshi Success. Maharshi, who was stripped of over 70 crore shares, has gained over 110 crore shares in just over four days to over 100 crore gras. Even in Nizam, it was surprising to trade sectors only 22 days after just 6 days. Mahesh is currently enjoying the success of the film. He has focused on his 26th film. The film is directed by Anil Ravapudi, who is currently in super form with super hit with four consecutive hits in Tollywood. The film will be released in the month of the next year and the film will be released next month. The film is going to be complete with a continuous schedule from July. There are a lot of news in the industry about the title of the movie.

Each of us has a certain sentiment in our Tollywood film industry as a kaarf address for most sentiments. Mahesh Babu has some sentiments too. It also has a few sentiments for his film titles. This is not the case for director Anil Ravapudi. What title does the story represent? It will follow as the title. Mahesh chooses the most of the titles in three letters. But now it is clear that Mahesh Anil has made a request for this film. It has been suggested that the film should be a three-letter title for the film. Mahesh seems to have a good idea that this sentiment will work out. But this is the same three-letter titles that gave super hit songs to Mahesh ... even superpops. Maharshi also became a super hit. Now what happens if the same sentimental follow up for this new project? I have to see.