//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రధాని మోదీ ముఖంలో ఓటమి లక్షణాలు.... అవును ఇది నిజమేనంటున్న ప్రతి పక్షాలు....?

Category : politics

దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా..... చివరి విడత ఎన్నికల ప్రచారం ముగిసాక ప్రధాని మోదీ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంపై విపక్ష నాయకులు భగ్గు మంటున్నారు.ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని పలు పార్టీల నాయకులు తమదైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. '‘పాపం మోదీ...ఓటమి భయం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది’' అంటూ ఎద్దేవా చేస్తున్నారు.ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ....ప్రతి నెల రేడియో ద్వారా వినిపించే ప్రధాని మోదీ ‘మాన్ కీ బాత్‌’ చివరి ఎపిసోడ్‌లా ప్రధాని మీడియా సమావేశం ఉందంటూ....! మోదీ కేవలం తొలిపలుకుకే పరిమితమై విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అలాగే మరో సీనియర్‌ నేత లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ అధినేత శరద్‌యాదవ్‌ తన ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ బీజేపీకి ఇదే చివరి విలేకరుల సమావేశమంటు...!

ఈ ఎన్నికల పోలింగ్‌కు ముందు నిర్వహించిన సమావేశంలో మోదీ హావభావాలు చూస్తుంటే ఓటమి ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన జోస్యం చెప్పారు.మరో వైపు జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, ఎన్‌సీపీ నేత ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ.... జర్నలిస్టు ముసుగులో ఉన్న కొందరు బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపేందుకే ప్రధాని ఈ సమావేశం నిర్వహించారని ఆయన ఎద్దేవా చేసారు. ఒకరిని ప్రశ్న అడిగితే మరొకరు సమాధానం ఇచ్చిన ఇటువంటి విలేకరుల సమావేశాన్ని తానేపుడు చూడలేదని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌పటేల్‌ మండిపడ్డారు. విలేకర్ల సమావేశాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా లేదంటూ రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లోత్‌ పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ప్రధాని మోధి పై అన్ని పార్టీల నేతలు మూకుమ్మడి మాటల దాడి చూస్తూ ఉంటే ఈ సారి బీజేపీ నడ్డి విరిగేలా ఉన్నట్టు కనిపిస్తుంది.