//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశంలోనే తొలి ఆయుర్వేద ఇనిస్టిట్యూట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రారంభించారు

Category : national

మంగళవారం రెండో ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద(ఏఐఐఏ)ను మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఒక ఆయుర్వేద ఆసుపత్రి ఉండాలన్నారు. ఇందుకోసం ఆయుష్‌ మంత్రిత్వశాఖ కృషి చేస్తుందన్నారు.

‘ఒక దేశం ఏ రకంగానైనా అభివృద్ధి చెందగలదు. కానీ ఆ దేశ చరిత్ర, వారసత్వ సంపదను గర్వించే స్థాయికి తీసుకెళ్లేంత వరకు ఏ దేశమూ ముందుకు సాగలేదు.’ అని మోదీ అన్నారు.ఈ ఇనిస్టిట్యూట్‌ను ఆయుష్‌ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేశారు. 10 ఎకరాల్లో రూ.157కోట్లతో నిర్మించారు. సంప్రదాయ ఆయుర్వేద జ్ఞానంతో ఆధునిక సాంకేతిక విశ్లేషణను సమన్వయ పరుస్తూ వైద్యం అందించేందుకే ఈ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఇనిస్టిట్యూట్‌లో న్యూరాలజీ, డీజనరేటివ్‌ డిసీస్‌ కేర్‌ యూనిట్‌, యోగా, పంచకర్మ క్లినిక్‌, క్రియకల్ప తదితర విభాగాలున్నాయి.