//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాబు తో ప్రధాని మోదీ ఏం చెప్పారంటే.. !

Category : politics

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రణరంగం గా మారుతుంది. ఏపీ కి ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీ లు వారికీ తోచిన విధంగా కేంద్రం ఫై పోరాడుతున్నారు.న్నీ సాయంత్రం కేంద్రం లో వున్న ఇద్దరు మంత్రులు తమ పదవులకి రాజీనామా చేసారు.

కేంద్ర మంత్రులు రాజీనామాను పీఎం కు ఇచ్చే తరుణం లో ఏపీ సీఎం కు మోడీ కాల్ చేసాడు. ఆ ఫోన్ లో ఏంమాట్లాడారనేది సీఎం తన మంత్రి వర్గం తో చర్చించాడు. ఏపీ కి వున్న సమస్యలను కూర్చొని మాట్లాడుకుంటే ఏదో ఒక పరిష్కారం దొరికేది కదా అని పీఎం చెప్పాడని చంద్రబాబు తన మంత్రులతో చెప్పాడు.

ప్రధాని మంత్రి చెప్పిన విషయం లో స్పందించిన బాబు ఇప్పటికే మేము నాలుగేళ్లు ఓపిక పట్టామని, ఇక ఎదురు చూసే పరిస్థితి లేనందువల్లనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పినట్టు మంత్రులకు బాబు స్పష్టంచేశారు.

ఇదే విషయమై చర్చించేందుకు ప్రధాని అక్కడికి పిలిచినప్పటికీ, ఇప్పుడు వెనక్కి తగ్గే పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పినట్టు సీఎం వారికీ చెప్పారు. ఆంధ్రుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ తీసుకున్న నిర్ణయం కనుక ఇక దీనిలో మార్పు వుండదు అని ప్రధానికి తేల్చి చెప్పానని అన్నారు. ఇప్పుడైనా పరిస్థితి ఏమీ చేయిదాటిపోలేదని, ఆంధ్ర ప్రదేశ్‌కి ఏమైనా మేలు చేయాలని భావిస్తే, చేయండి అని తాను ప్రధానిని కోరినట్టు చంద్రబాబు తెలిపారు.