//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రధాని మోదీ ఆత్మరక్షణ ధోరణి

Category : editorial

సరిగ్గా ఐదేళ్ల క్రితం 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం.. 2014లో సార్వత్రిక ఎన్నికలకు దిశా నిర్దేశంచేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతకుముందు 2002 నుంచి మూడు సార్లు సొంత రాష్ట్రం గుజరాత్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దీంతో బీజేపీ అధి నాయకత్వం.. 2013 సెప్టెంబర్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికచేసింది.

అప్పటికే పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరిగా ఎల్ కే అద్వానీ కూడా మోదీ ఎదుగుదలపై ఆగ్రహించారు కూడా. కానీ చరిత్ర మరో కోణంలో ముందుకు దూసుకుపోయింది. మరోసారి వచ్చే డిసెంబర్ నెలలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోదీ రాజకీయ భవిష్యత్‌ను, 2019 లోక్‌సభ ఎన్నికలను నిర్దేశించనున్నాయి.

ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్ నేతలే కావడంతో తేలిగ్గా ఈ రాష్ట్రంలో గెలుచుకోవచ్చునని ఊహించొచ్చు. కానీ బీజేపీ విజయం ఊహించలేకపోతున్నది.గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. గత జూన్ నుంచి పరిస్థితులు మారిపోయాయి. అధికార బీజేపీలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మినహా చెప్పుకోదగిన ప్రముఖ నాయకుడే లేరు. ఇదే పరిస్థితి కాంగ్రెస్ ముందు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్ మినహా ప్రముఖ నేతలు లేకపోవడం ఆ పార్టీకి కూడా ఇబ్బందికరమే.

దేవాంశ సంభూతుడిగా ప్రధాని మోదీ విజయ సంకేతాలు తగ్గుముఖం పట్టాయి. ఆయన మోములో ఆందోళన స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఆయన భాష ఆత్మరక్షణ ధోరణిని తెలియజేస్తోంది. ఆయనలోని ఆడంబరం, విశ్వాసం తప్పిపోయింది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అడుగులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. ఆయన రోజురోజుకు శక్తిమంతంగా కనిపిస్తూ మరింత సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఇక ఆయనపై జోక్‌లు వేసే అవకాశాలు కనిపించట్లేదు. జాతీయ రాజకీయాల్లో ఆయనను 'పప్పు' అని ఎగతాళి చేస్తుండే వారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షణ శక్తి పెంచుకోవడం ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆందోళనకు గురి చేస్తోంది.2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించింది. నాడు అధికార కాంగ్రెస్ పార్టీగా పలు కుంభకోణాలు ఎదుర్కొంటున్నది. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షోభాల్లో చిక్కుకుని పోయింది. దాని ప్రజాదరణ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. తద్వారా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని సాగనంపేందుకు మార్గం ఏర్పడింది. 2009 ఎన్నికల్లో దారుణ ఓటమిని చవి చూసిన బీజేపీని గట్టెక్కించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) బాధ్యతలు స్వీకరించింది. సమీకరణాలు మారిపోయాయి.2014లో కాంగ్రెస్ పార్టీ నైతిక స్థైర్యాన్ని కోల్పోయి ఉన్నది. నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ పూర్తిగా అమలు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ప్రజల ముందు నిలిచింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయి, అందుకు విరుద్ధంగా మారాయి. భారీ వాగ్దానాలు చేసి అమలు చేయడంలో విఫలమైంది. క్రితం సారితో పోలిస్తే ప్రజా వ్యతిరేకతను రెట్టింపు చేసుకున్నదన్న విమర్శలు ఉన్నాయి.

Related News