//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

22న గుజరాత్‌కు ప్రధాని మోదీ

Category : national

త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ఈ నెల 22న ప్రధాని మోదీ మరోసారి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భావ్‌నగర్, వడోదర జిల్లాల్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు ప్రధాని గుజరాత్‌లో పర్యటించారు. భావ్‌నగర్‌ జిల్లాలోని ఘోఘా, భరూచ్‌ జిల్లాలోని దహేజ్‌ల మధ్య 'రోల్‌-ఆన్‌ రోల్‌-ఆఫ్‌' ఫెర్రీ(వాహనాల్ని తరలించేందుకు) సేవల్ని ప్రారంభిస్తారు. ఘోఘాలో ప్రసంగించిన అనంతరం.. దహేజ్‌ నుంచి ఘోఘా వరకూ ఫెర్రీలో ప్రయాణిస్తారు. అనంతరం దహేజ్‌ నుంచి వడోదర వెళ్తారు. అక్కడ రూ. 1,140 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.