//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాష్ట్రపతికి జులై 23న వీడ్కోలు..!

Category : national

రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న ప్రణబ్‌ ముఖర్జీకి పార్లమెంట్‌ ఉభయసభలు ఘనంగా వీడ్కోలు పలకనున్నాయి. జులై 23న పార్లమెంట్‌ సభ్యులు రాష్ట్రపతికి వీడ్కోలు ఇవ్వనున్నట్లు సమాచారం. జులై 24తో రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ కాలం పూర్తతుంది. అంతకు ఒక రోజు ముందే ఆయనకు వీడ్కోలు ఇవ్వనున్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2012 జులై 25న భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ బాధ్యతలు చేపట్టారు. యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలతో కలిసి పని చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రణబ్‌ రాజ్యసభకు 5 పర్యాయాలు, లోక్‌సభకు 2 సార్లు ఎంపికయ్యారు.. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక శాఖల మంత్రిగానూ పని చేశారు.

తదుపరి రాష్ట్రపతి ఎంపిక కోసం జులై 17న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌, విపక్షాల అభ్యర్థి మీరా కూమార్‌ ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. జులై 20న ఫలితాలు విడుదల చేస్తారు. జులై 24లోగా భారత కొత్త రాష్ట్రపతి కొలువు దీరుతారు.

Related News