//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గర్బిణీ హత్య వెనుక వీడిన మిస్టరీ...ఎంత దారుణంగా చంపారో తెలుసా...!

Category : state

గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ సమీపంలో సంచలనం సృష్టించిన గర్బిణీ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కారణంతో భర్త వికాసే ఆమెను హత్య చేశాడని పోలీసులు నిర్దారించారు. పొంతన లేని సమాధానాలతో నీళ్లు నమలుతూ వచ్చిన నిందితులు ఎట్టకేలకు నోరు విప్పడంతో అసలు నిజాలు బయటపడ్డాయి.

అమర్ కాంత్ తల్లితో వికాస్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది.గత ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయంలో పద్దతి మార్చుకోవాలని వికాస్ భార్య పింకీ అతన్ని పదేపదే హెచ్చరించింది.అమర్ కాంత్ తల్లి మమత తో సంబంధం తెంచుకోవాలని సూచించింది.ఈ నేపథ్యంలోనే వికాస్,అమర్ కాంత్ తల్లి మమత ఆమెపై కక్ష పెంచుకున్నారు.

తమ వివాహేతర సంబంధానికి పింకీ పదేపదే అడ్డు వస్తుండటంతో ఇక ఆమెను లేకుండా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు వికాస్,మమత.ఇదే విషయాన్ని మమత అమర్ కాంత్ తోనూ చెప్పింది.దీంతో అంతా కలిసి ఆమె హత్యకు ప్లాన్ వేశారు.హత్యకు రెండు రోజుల ముందు ఆమెను కిడ్నాప్ చేశారు.

కిడ్నాప్ చేసి తీసుకొచ్చాక పింకీని అత్యంత దారుణంగా హతమార్చారు.వికాస్ తన కన్న కొడుకు ముందే పింకీని హత్య చేశాడు.హత్యానంతరం ఎలక్ట్రిక్ కట్టర్‌తో ఆమె శరీర భాగాలను ముక్కలు,ముక్కలుగా కోశారు.ముఖాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోలు పోసి తగలబెట్టారు.ఆపై జనవరి 29వ తేదీ తెల్లవారుజామున బొటానికల్ గార్డెన్ సమీపంలో అమర్ కాంత్, అతని తల్లి మమత ఆ శవాన్ని కుక్కిన మూటను పడేసి పారిపోయారు.

వికాస్ సిద్దిఖీనగర్ లోనే స్థానికంగా ఓ పానీపురి బండి నడుపుతున్నట్టు తెలుస్తోంది.అదే కాలనీలో గత మూడు నెలలుగా అద్దెకు ఉంటున్న అమర్‌కాంత్ ఝాతో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఇళ్లకు రాకపోకలు మొదలైనట్టు తెలుస్తోంది.అలా అమర్‌కాంత్ తల్లితో వికాస్‌కు వివాహేతర సంబంధం ఏర్పడి ఉంటుందని తెలుస్తోంది.

హైదరాబాద్ పోలీసులు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.నిందితులు మమతా ఝా, అనిల్ ఝా, అమర్‌కాంత్ ఝా,వికాస్ కశ్యప్ కలిసి గర్భిణి పింకిని అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.మొదట హత్య చేసి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి చంపినట్లు పోలీసులు చెప్పారు. హత్య చేశాక మరుసటి రోజున గోనెసంచిలో మృతదేహాన్ని పెట్టి బొటానికల్ గార్డెన్‌ దగ్గర పడేశారు.

మృతురాలు పింకి అలియాస్ బింగీకి 13ఏళ్ల క్రితం దినేశ్‌తో వివాహం అయ్యింది.వీరికి ఇద్దరు మగపిల్లలు,ఓ ఆడపిల్ల.భర్తతో విబేధాల కారణంగా వికాస్‌తో పింకికి వివాహేతర సంబంధం ఏర్పడింది.దీంతో గచ్చిబౌలి సిద్ధిక్‌నగర్‌లో వికాస్,పింకి గదిని అద్దెకు తీసుకున్నారు.అయితే ఆర్థిక సమస్యలు మొదలవడంతో పింకిని హత్య చేయాలని వికాస్ పథకం పన్నాడు.

జనవరి 27 రాత్రి పింకి,వికాస్ కుటుంబసభ్యుల మధ్య గొడవ జరిగింది.ఎనిమిది నెలల గర్భంతో ఉన్న పింకి కడుపుపై వికాస్ కుటుంబసభ్యులు బలంగా తన్నారు.దీంతో పింకి అక్కడికక్కడే చనిపోయింది.మృతదేహాన్ని ఒకరోజు ఇంట్లోనే దాచారు.మరుసటి రోజున కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కోశారు. ముక్కలు చేసిన మృతదేహాన్ని మూటలు కట్టారు.జనవరి 29 తెల్లవారుజామున 3:30గంటలకు బైక్‌పై తీసుకువెళ్లి బొటానికల్ గార్డెన్ దగ్గర పడేశారు. నిందితుల నుంచి కట్టర్, పింకి దుస్తులు, బ్యాగ్, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related News