కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గెలుపు సాధించిన ప్రతిసారీ గెలుపుకు కారణమైన ఆటగానికో, జట్టు కెప్టెన్ కో జట్టు యజమాని అయిన అందాల నటి ప్రీతీ జింటా అందమైన, మధురమైన బహుమతిని బోనస్ గా ఇస్తున్నది. వారిని ఆమె కౌగిలింతలతో ఉక్కిరి బిక్కిరి చేయడమే.
అదీ మామూలు కౌగిలింత కాదు. ఏ ఆదునిక యువతి అయినా తన ప్రియుడికి మాత్రమే ఇచ్చే ప్రగాఢమైన కౌగిలింతను ప్రీతీ జింటా జట్టు కెప్టెన్‌కో ఆరోజు బాగా ఆడిన జట్టు ఆటగాడికో ఉదారంగా పంచిపెడుతోంది.
గురువారం ముంబై ఇండియన్స్ జట్టుపై పంజాబ్ జట్టు చెమటోడ్చి మరీ గెలుపు సాధించగానే పెవిలియన్‌లో లేచి నిలబడి ఉగ్గబట్టుకుని చూస్తున్న ప్రీతి జింటా ఒక్కసారిగా విజయ నాదం చేసి పక్కనున్న విదేశీ ఆటగాడిని గట్టిగా కౌగలించేసుకుంది. ఆ తర్వాత అటువైపు ఉన్న జట్టు రిజర్వ్ ఆటగాడిని హగ్ చేసుకుంది.
ఆమె కౌగిలింతలతో జట్టు సభ్యులకు కౌగలింతలు ఇచ్చి ఉత్సాహపర్చడం ఐపీఎల్ 10 సీజన్‌లోని ఇతర జట్లను అసూయలో ముంచెత్తుతోంది. ఇప్పటికే గురువారం మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను మట్టిగరపించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇలా ప్రీతీ జింటా కౌగిలింతలతో ఆనంద పరుస్తుంటే ఫైనల్ చేరినా చేరవచ్చు. కప్పు గెలవా గెలవవచ్చు అంటూ నెటిజన్లు వేళాకోళం చేస్తున్నారు.