Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వేస‌విలో తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు..!

Category : editorial health

ఈసారి ఎండ‌లు మండిపోతున్నాయి. రోజురోజుకీ వేస‌వి తీవ్ర ప్ర‌తాపం చూపిస్తోంది. ప్ర‌స్తుతం మ‌రో రెండు, మూడు రోజులు ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ని, రికార్ఢు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయ‌ని అధికారులు తెలుపుతున్నారు. మ‌రీ అవ‌స‌ర‌మైతే త‌ప్ప ఇంట్లోనుంచి బ‌య‌టికి రావ‌ద్ద‌ని సూచిస్తున్నారు. వ‌డ‌దెబ్బ వ‌ల్ల డీహైడ్రేష‌న్ కి లోనుకాకుండా చూసుకోవాల‌ని సూచిస్తున్నారు.

వేసవి లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో రకాలు. ఈ ఎండల్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎండ దెబ్బకి నీరస పడిపోవాల్సిందే. వేసవి ముగిసేవరకూ ప్రతి ఒక్కరూ, ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి.వేసవి తాపం తగ్గడానికి అందరూ, ఎక్కువగా నీటినే త్రాగుతుంటారు. కానీ నీరు ఒక్కటే సరిపోదు. రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తయారు చేసుకుని సేవిస్తే వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐస్‌ క్రీములు, కోలా పానీయాలు, రసాయన పూరితాలు క‌నుక వాటిని తీసుకోవ‌డం అంత మంచిదికాదు. స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగాలి. పండ్ల ర‌సాలు, కొబ్బ‌రినీళ్ళు ఎక్కువ‌గా తీసుకోవాలి. తేలిక‌గా అరిగి జీర్ణ‌మ‌య్యే ఆహార ప‌దార్ధాలు తీసుకోవాలి.

వేసవిలో ఉత్సాహం కలిగించేలా వివిధరకాల పండ్ల రసాలు పానీయాలు చాలా తేలిక పద్ధతులలో తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు, పుదీనా, కొత్తిమీర రసాలు, పుచ్చకాయ, అల్లపురసం పానీయం, దానిమ్మ, ద్రాక్ష రసాలు వంటివి ఇళ్ళలోనే తయారు చేసుకుని సేవించాలి. నూనె ప‌దార్ధాలు,వేపుళ్ళు వేస‌విలో ఆరోగ్యానికి మంచిదికాదు. పెరుగు ఎక్కువ‌గా తీసుకోవాలి. చ‌ల్ల‌ద‌నంతోపాటు పెరుగు మంచి పౌష్టికాహారం కూడా.వేసవిలో తెల్లని కాటన్‌ దుస్తులే వేసవికి సరిగ్గా సరిపోతాయి. వేసవిలో ఎండవేడిమికి చర్మం కమిలి పోకుండా మృదువుగా నిగనిగలాడుతూ ఉండాలంటే మాయిశ్చరైజర్ వాడాలి. సమ్మర్ లో ప్రతి రోజూ 8 నుండి 10గ్లాసుల నీరు తాగాలి.స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు వెనిగర్ వేస్తె చెమట వాసన ఉండదు. వేసవిలో నిమ్మరసం ముఖానికి రాసుకుని ఓ అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం ఫ్రెష్ గా ఉంటుంది.

Related News