Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టోల్ గేట్ వద్ద ఏపి మంత్రి భార్య ఏం చేసిందో చూడండి ..... కక్కుర్తి కి పోయి వైరల్ గా మారింది పాపం.

Category : state

ఆవిడ స్వయాన ఓ మంత్రిగారి భార్య..... మంత్రిగారి భార్య అంటే డబ్బుకు కొదువే ముంది.. కానీ ఆమె చూపిన చిల్లరతనం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఆవిడ ఎవరో మీకు చెప్పలేదు కదూ.. ఆమె ఎవరో కాదు మన ఏపి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి, భార్య వెంకట కుమారి. ఆమె హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ దారిలో నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలోని టోల్‌గేటు వద్దకు చేరుకున్నారు. సాధారణంగా టోల్‌ గేటు వద్ద మంత్రులు, ఆపై స్థాయి నాయకులకు ఉచితం ఉంటుంది. కానీ ఆ స్టిక్కర్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఫ్రీ మాత్రం ఉండదు. కానీ సదరు మంత్రి గారి భార్య మాత్రం తాను మంత్రి గారి భార్యనంటు తనను తక్షినం ఏటువంటి రుసుము లేకుండా పంపాలి అంటూ వారితో వారించే ప్రయత్నం చేసింది. కానీ అక్కడి సిబ్బంది సైతం అదే రీతిలో ఆమెతో వారించే ప్రయత్నం చేశారు. అలా పంపడం సరి కాదని అది రూల్స్ కి విరుద్దం అంటూ సౌమ్యం గా చెప్పే ప్రయత్నం చేసిన....

వారి మాటలు ఏ మాత్రం పట్టించుకోని సదరు మంత్రి గారి భార్య మాత్రం బీరాలకు పోయి మరి..... తన పవర్ ఏంటో,తాను తలుచుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టింది. ఈ సమయంలో అసలు లాజిక్ మరచిపోయిన మంత్రి గారి భార్య.. తాను టోల్ గేటు ఫీజు కట్టేదేలేదని భీష్మించుకున్నారు. అక్కడి సిబ్బంది ఎన్ని సార్లు నిబంధనలు వివరించినా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు.. ఫలితంగా కొంత మేరకు అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోవడం గమనార్హం. తాను మంత్రి గారి భార్యను నన్నే టోల్ గేటు ఫీజు అడుగుతారా అంటూ వారితో గొడవకు దిగింది కూడా.కానీ ఆ టోల్ గేట్ సిబ్బంది కూడా ఎక్కడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.. ఫ్రీ వే అన్నది ఒక్క మంత్రిగారికే తప్ప.. ఆ కారు వేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉండదని.. ఫీజు కట్టాల్సిందేనని తెగేసి చెప్పారు. ఎంతసేపు గొడవపెట్టుకున్నా సిబ్బంది వినకపోయేసరికి వారిపై రుసరుసలాడుతూ టోల్ ఫీజు కట్టక తప్పలేదు పాపం.ముందే కట్టవలసిన రుసుము కట్టి ఉంటే తిన్నగా వెళ్లి ఉండేది. కానీ ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related News