//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నికల్లో గెలవడం ఎలా అని పుస్తకం రాస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్...!

Category : politics

ప్రముఖ ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక బుక్ రాస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి, బిహార్‌ ఎన్నికల్లో నితీశ్‌ కుమార్‌ ప్రచారానికి ప్రధాన వ్యూహ కర్తగా వ్యవహరించినాడు.

ఎన్నికల్లో గెలుపోటములు ఎలాగన్నదానిపై ‘ద ఎలక్షన్‌ గేమ్‌’అనే పేరుతో ఆ పుస్తకాన్ని రచిస్తున్నారు. ఈ పుస్తకానికి సహ రచయితగా పాత్రికేయుడు సంకర్షన్‌ ఠాకూర్‌ వ్యవహరిస్తున్నారు.

ఈ పుస్తకాన్ని ఈ ఏడాది చివరి నాటికి జగ్గర్‌నాట్‌ బుక్స్‌ సంస్థ పబ్లిష్‌ చేయనుంది. ఈ విషయం ఫై ప్రశాంత్‌ కిషోర్‌ మాట్లాడుతూ, రాయడం నాకు కొత్త. ఇది పూర్తిగా నాకు కొత్త ప్రపంచం.

అయితే మాట్లాడడం, చర్చల వల్ల కంటే చదవడం వల్ల విషయం నేరుగా మనసులోకి వెళుతుంది. యువత, ఉద్యోగులు వీటి నుంచి చాలా ప్రభావితమవుతారు. అందుకే ఈ పుస్తక రచన అంటూ అయన అన్నారు.