//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ నేత‌లు వసంత కృష్ణ ప్ర‌సాద్‌, కొడాలి నానిపై ప్ర‌శాంత్ కిశోర్ తాజా స‌ర్వే..!

Category : politics

వైసీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి 2019 సాధార‌ణ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా త‌న రాజ‌కీయ వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. 2019 ఎన్నిక‌ల‌తో ఎలాగైనా అధికారంలోకి రావాల‌న్న ఆకాంక్ష‌తో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత విస్తృతం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్నారంటూ ఇటు అధికార టీడీపీ నేత‌ల‌తోపాటు రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అయితే, వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఇటీవ‌ల సంవ‌త్స‌ర కాలాన్ని పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్య‌క్ర‌మాల‌ను కూడా చేప‌ట్టింది. అధికార‌మే లక్ష్యం మొన్న‌టి వ‌ర‌కు ఎటువంటి అంత‌రాయం లేకుండా కొన‌సాగిన జ‌గ‌న్ పాద‌యాత్ర కోడి క‌త్తితో హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా బ్రేక్ ప‌డిన విష‌యం తెలిసిందే.Prashant kishor survey on YCP Leaders

వైఎస్ జ‌గ‌న్ ఏ జిల్లాలో పాద‌యాత్ర‌ మొద‌లు పెట్టినా ఆ జిల్లాకు సంబంధించి ఎక్కువ మంది ఉన్న సామాజిక‌వ‌ర్గాన్ని దృష్టిలో పెట్టుకుని హామీల‌ను గుప్పించిన విష‌యం తెలిసిందే. అందుకు ఉదాహ‌ర‌ణ కృష్ణా జిల్లాలో కొన‌సాగిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. కృష్ణా జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతున్న సంద‌ర్భంలో తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానంటూ జ‌గ‌న్ అనాలోచిత నిర్ణ‌యంతో హామీ ఇచ్చార‌ని, ఆ హామీపై ఆ పార్టీ నేత‌లు సైతం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డ ఉదంతాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్ అంశంతోపాటుగా..

ఇలా అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా హామీలు ఇవ్వ‌డంతోపాటు తాను ఇన్‌ఛార్జ్‌లుగా నియ‌మించిన, ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపై ప్ర‌శాంత్ కిశోర్ చేత ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్. ఆ నేప‌థ్యంలోనే మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా నియ‌మించిన వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌తోపాటు, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానిపై స‌ర్వే చేయించారు జ‌గ‌న్‌.

వారిద్ద‌రిపై ప్ర‌శాంత్ కిశోర్ త‌న సిబ్బంది చేత చేయించిన స‌ర్వే రిపోర్టును హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న జ‌గ‌న్‌కు అంద‌జేశారు. మొద‌ట‌గా మైల‌వ‌రం వైసీపీ నేత‌గా కొన‌సాగుతున్న వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ రిపోర్టును చూసిన జ‌గ‌న్‌కు షాక్ త‌గిలినంత ప‌నైంద‌ట‌. కృష్ణా జిల్లా మొత్తంగా 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే వైసీపీ కేవ‌లం రెండంటే.. రెండు ఎమ్మెల్యే సీట్ల‌ను మాత్ర‌మే సొంతం చేసుకుంటుంంద‌ని, ఆ గెలుపుపొందే స్థానాల్లో వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌కు నియోజ‌క‌వ‌ర్గం లేద‌ని ప్ర‌శాంత్ కిశోర్ స‌ర్వే తేల్చి చెప్పింది.

ఇక‌, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని రిపోర్టులో సైతం సేమ్ సీన్ రిపీటైంద‌ట‌. ప్ర‌శాంత్ కిశోర్ స‌ర్వే చెప్పిన‌ట్టు కృష్ణా జిల్లాలో వైసీపీ గెలిచే రెండు స్థానాల్లో గుడివాడ‌కు చోటు ద‌క్క‌లేదు. దీంతో వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌తోపాటు కొడాలి నాని ఓట‌మి ఖాయ‌మ‌నే విష‌యాన్నిస‌ర్వే తేల్చింది. స‌ర్వే రిపోర్టును కూలంకుషంగా చ‌దివిన జ‌గ‌న్ కృష్ణా జిల్లాలో పార్టీ అభివృద్ధికి చ‌ర్య‌లు ప్రారంభించాల‌ని ముఖ్య నేత‌ల‌ను ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

Related News