//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రకాష్‌రాజ్‌కు రాజ్యసభ సీటు ?

Category : politics

ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ సినిమాల్లో కంటే రాజకీయ వ్యాఖ్యాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు.

ముఖ్యంగా బీజేపీ ని ఏకి పారేస్తున్నారు అందుకే అన్ని ప్రధాన పార్టీలు ఆయనపై కన్నేశాయి. ఇటీవల ఆయన బెంగళూరులో ప్రధాని మోదీ ర్యాలీపై సెటైర్లు వేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి ఆయన మీద పడేట్లు చేసినట్టు సమాచారం.

ఈ నేపధ్యంలో ప్రకాష్ రాజ్‌ను అభిమానించే కొంతమంది సాహితీవేత్తలు, కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వద్ద ఓ కీలక ప్రతిపాదన తీసుకొచ్చారని తెలియవచ్చింది. వారి ప్రతిపాదన ఏంటంటే ప్రకాష్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ ఇవ్వాలని, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాని ప్రకాష్ రాజ్ వామపక్షాలకు దగ్గరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సీటు పొందేందుకు అంగీకరిస్తారా లేదా అనే అనుమానం వ్యక్తమైనట్లు తెలిసింది. దీని పై ఏఐసీసీతో సంప్రదింపులు జరిపి తమ నిర్ణయం తెలుపుతామని సిద్దరామయ్య చెప్పినట్లు తెలిసింది. దీనిపై ప్రకాష్‌రాజ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.