//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహిళల కబడ్డీలో ప్రకాశం సత్తా

Category : sports

గుంటూరు జిల్లా మంగళగిరి వీటీజేఎంఅండ్‌ఐవీటీఆర్‌ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల మహిళల కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి 14 కళాశాలల జట్లు పాల్గొన్నాయి. విశ్వవిద్యాలయం జట్టు రోలింగ్‌ షీల్డ్‌ను కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు జట్టు ప్రథమ, కనిగిరి ద్వితీయ, చీరాల తృతీయ బహుమతి అందుకున్నాయి. ప్రకాశం జిల్లా జట్లు కబడ్డీలో మేటిగా నిలిచాయి. కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ డాక్టరు గోలి రామ్మోహనరావు అధ్యక్షతన నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ సభలో విశ్వవిద్యాలయం పీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జాన్‌సన్‌, విశ్వవిద్యాలయం క్రీడా కళాశాల ప్రిన్సిపల్‌ పి.పి.ఎస్‌.పాల్‌కుమార్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ టి.నిర్మలకుమారి, విశ్వవిద్యాలయం క్రీడా పూర్వ డైరెక్టర్‌ విజయరావు, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.ఎస్‌.మెర్సిన్‌బాబు పాల్గొన్నారు.రెండు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో ప్రాంగణం కళకళలాడింది. ముగింపు సభలో వాణి హైస్కూలు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.