ప్రదీప్ మాచిరాజు ఒక టీవీ వ్యాఖ్యాత. ఈయన అక్టోబరు 23,1985 లో జన్మించాడు.విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ పూర్తీ చేసాడు.
తర్వాత విదేశాలకు వెళ్ళి ఎం. బి. ఎ చదవాలనుకున్నాడు. కానీ తల్లిదండ్రుల అనుమతితో కొంత సమయం తీసుకుని మరేదైనా వృత్తిలో ప్రవేశించాలనుకున్నాడు. కొద్ది రోజులు ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేశాడు. తర్వాత రేడియో జాకీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అక్కడ అతని గాత్రం అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది.
ప్రదీప్ ఈరోజు ఒక సక్సెస్ ఫుల్ యాంకర్ అయ్యుండచ్చు కాని ఒక సక్సెస్ ఫుల్ యాంకర్ గా నిలదొక్కుకోడానికి ప్రదీప్ చాల కష్టపడ్డాడు. ప్రదీప్ అంత సులభంగా ఏమి యాంకర్ కాలేదు. ముందుగా కొన్ని లోకల్ చానల్స్ కి ప్రదీప్ యాంకర్ గా పని చేశాడు. లోకల్ చానెల్స్ కే కాక కొన్ని ఈవెంట్స్ కి కూడా యాంకర్ గా వ్యవహరించేవాడు.
ప్రదీప్ తన TV షో ల కోసం ఖరీదైన మరియు బ్రాండ్ దుస్తులు ధరిస్తాడు. అయితే షో అయిపోయిన వెంటనే అందరిలా ప్యాక్ చేయించి ఇంటికి పట్టుకెళ్ళకుండా ఆ బట్టలని వేలం వేసి అమ్మేస్తాడు. వేలం ద్వారా వచ్చిన మొత్తం డబ్బుని అతను అనాధ శరణాలయాలు మరియు సామాజిక సేవా సంస్థలకి విరాళంగా ఇచ్చేస్తాడు.
జీ తెలుగు లో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా కార్యక్రమాన్ని రూపొందించి దానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. జీ తెలుగులో ప్రసారమైన గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమానికి గాను ప్రదీప్ కు టీవీ నంది పురస్కారం.
డిసెంబరు 31, 2017 న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల ప్రదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కారు స్వాధీనం చేసుకుని అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ అనంతరం అయన కారు ను ఆయనకు అప్పగించారు.
నేను తగి డ్రైవ్ చేశాను అది చాల తప్పు,ఇంకెవరు ఆలా చేయకండి అని అభిమానులకి క్షమాపణలు చెప్పారు.