//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మాజీ ఎంపీకి యావజ్జీవ కారాగార శిక్ష.

Category : national

ఆర్జేడీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ హజారీబాగ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1995 పట్టపగలు ఎమ్మెల్యే అశోక్ సింగ్ ను ఆయన నివాసంవద్దే దుండగులు కాల్చిచంపారు.ఈ హత్యకేసులో ఇటీవల ప్రభునాథ్ సింగ్‌ దోషిగా నిర్ధారించిన కోర్టు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారించిన జిల్లా అదనపు న్యాయమూర్తి సురేంద్ర శర్మ ప్రభునాథ్ సింగ్‌తో పాటు ఆయన సోదరుడు దీననాథ్ సింగ్, మాజీ సర్పంచ్ రితేశ్ సింగ్‌లకు కూడా జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. 1997లో పాట్నా హైకోర్టు ఈ కేసును పాట్నా నుంచి హజారీబాగ్‌కు బదిలీ చేసింది. నిందితుడు ప్రభునాథ్ సింగ్ ఎంపీగా, ఎమ్మెల్యేగా మహారాజ్‌గంజ్, మార్సాఖ్ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించారు.