//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేన కి అండగా ప్రభాస్ ....

Category : politics

టాలీవుడ్ టాప్ హీరో , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలని పూర్తిగా వదిలి రాజకీయాలలోకి వచ్చిన విషయం తెలిసిందే . పోయిన సార్వత్రిక ఎన్నికల ముందే జనసేన పార్టీ ని స్థాపించి , ప్రశ్నించడానికే వచ్చా అంటూ సభలతో హోరెత్తించాడు . కానీ ఎన్నికల కి సమయం చాలా తక్కువగా ఉండడం తో , ప్రణాలికలు అమలు చేయడానికి వీలు కాక ,బీజేపీ , టీడీపీ కి మద్దతుగా నిలిచాడు . 2014 ఎన్నికల్లో ఏపీ లో టీడీపీ అధికారంలోకి రావడానికి తనవంతు పాత్ర పోషించాడు .

ఇక పొతే గత కొన్ని రోజుల నుండి టీడీపీ చేస్తున్న అక్రమాలపై టీడీపీ నేతలని విమర్శిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా ఎదిగాడు . ప్రస్తుత ప్రజాపోరాట యాత్ర అంటూ రాష్ట్రము లో సభలు పెడుతూ రాజకీయ వేడిని పెంచుతున్నాడు . అలాగే పార్టీ నిర్మాణంలో కూడా వ్యహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు . ఈ మద్యే రెబల్ స్టార్ కృష్ణం రాజు బీజేపీ ని విడి జనసేన లో చేరాడు . దీనితో జనసేన కి రోజు రోజుకి ఆదరణ పెరిగిపోతుంది .

ఇక అసలు విషయం ఏమిటంటే ....కృష్ణం రాజు వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నాడని తెలుస్తుంది . రాబోవు ఎన్నికల్లో జనసేన కె తన మద్దతు అంటున్నట్టు తెలుస్తుంది . ఎలాగూ తన పెదనాన్న ఉన్నాడు కాబట్టి జనసేన కి మద్దతు ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది . దీనితో పవన్ కళ్యాణ్ కి , మన బాహుబలి తోడైతే ఇక ఏపీ లో జనసేన ని ఎదుర్కోవడం ఎవరితరం కాదని అందరూ చెప్పుకుంటున్నారు .