//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభాస్ ను ఆమె చెంప మీద అలా కొట్టేసింది ఏంటి ?

Category : movies

బాహుబలి, డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా యువత ప్రభాస్ అంటే పడి చస్తారు. ఇక 'బాహుబలి' తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కు క్రేజ్ మరింత పెరిగింది. దేశ విదేశాల్లో కూడా లేడీ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది.

ప్రభాస్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ చుట్టూ వాలిపోతున్నారు. అయితే, ఇటీవల ప్రభాస్ కు ఫారిన్ ఎయిర్ పోర్ట్ లో ఒక గమ్మత్తైన సంఘటన ఎదురైంది. ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ నడుస్తుండగా, ఒక భారతీయ యువతి ప్రభాస్ ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఫోటో కోసం అడిగింది. ప్రభాస్ కూడా వెంటనే ఒప్పుకుని ఫొటోకు పోజ్ ఇచ్చాడు.

ఆ అమ్మాయి ప్రభాస్ ని చూసిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యి గెంతులేస్తోంది. ఫోటో తీసుకున్నాక వెళుతూ వెళుతూ గబుక్కున ప్రభాస్ చెంపై నెమ్మదిగా గా కొట్టేసి వెళ్ళిపోయింది. ప్రభాస్ కూడా ఆమె చేష్టకు నవ్వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో చెప్పడానికి ఈమెను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రంతో ఆగస్ట్ 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాహో చిత్రంతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు.