//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్ర‌భాస్‌కి బిగ్‌ హ్యాండ్.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌తో అనుష్క పెళ్లి..?

Category : movies

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్కకు పెళ్లికి సంబంధించి ర‌క‌ర‌కాలు వార్త‌లు చాలా రోజులుగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజా హాట్ మ్యాట‌ర్ ఏంటంటే.. స్వీటీకి వ‌రుడు దోరికాడ‌నే న్యూస్ సోష‌ల్ మీడియాలోనే కాకుండా సినీ వ‌ర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతోంది. 2005లో సూప‌ర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క దాదాపు తెలుగు అగ్ర హీరోలంద‌రితో న‌టించింది. ఈ సంవ‌త్స‌రం 37వ ఏట అడుగుపెట్ట‌నున్న.. అనుష్క పెళ్లి గురించి త‌ర‌చూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. దీంతో అనుష్క పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

అయితే ఇప్పుడు లేటెస్ట్ మ్యాట‌ర్ ఏంటంటే.. అనుష్క పెళ్లి దాదాపు ఫిక్స్ అయిపోయిందని.. విశ్వసనీయ వర్గాల నుండి ఓ వార్త లీక్ అయ్యింది. అనుష్క ఈ ఏడాది చివర్లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతోంద‌ని స‌మాచారం. ఇప్పటికే అనుష్క కుటుంబ సభ్యులు వరుడిని వెదికార‌ని, ఆ వరుడు అనుష్కకి కూడా నచ్చాడని తెలిసింది. త్వరలోనే అనుష్క పెళ్లి పై అధికారిక ప్రకటన రావచ్చని వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో వార్త ఏమిటంటే.. అనుష్కకి కాబోయే భర్త ఒక బిజినెస్ మెన్ అని, అతనకి దుబాయ్‌లోవ్యాపారం చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక స్వీటీ సినిమాల విషయానికి వస్తే గౌతమ్ మీనన్ తో ఓ సినిమా చేస్తుంది అనుష్క. ఇటివలే సైలెన్స్ అనే టైటిల్‌తో మరో తెలుగు సినిమా అంగీకరించింది. వీటిని పూర్తి చేసిన తరువాత పెళ్లి పీటలెక్కనున్నారని, ఆ తరువాత నటనకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా డార్లింగ్ ప్ర‌భాస్‌కి అనుష్క పెద్ద హ్యాండ్ ఇవ్వ‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.