Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సాహో మూవీ ఫస్ట్ సాంగ్ "సైకో సయాన్" టీజర్ విడుదల!

Category : movies

కొన్ని రోజుల కిందటే "సాహో" టీజర్ చూసాం.అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉన్న ఈ టీజర్.ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది.ఇక "సాహో" మ్యూజిక్ తుపాను కూడా ఇప్పుడు మొదలైంది.ఇంకోన్ని రోజుల్లోనే సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచే క్రమంలో ఈ చిత్రం నుంచి తొలి పాట "సైకో సయాన్" టీజర్ ను విడుదల రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఫస్ట్ సాంగ్ "సైకో సయాన్" విషయానికి వస్తే దీన్ని బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్చితో చేయించుకున్నారట. బాలీవుడ్లో ఈ సంగీత దర్శకుడి ఖాతాలో మ్యూజికల్ హిట్లు చాలానే ఉన్నాయి.అతడి పాటలు కొన్ని యూట్యూబ్‌లో 500 మిలియన్ మార్కును అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.కాబట్టి "సైకో సయాన్" పాట చాలా స్పెషల్‌గా ఉంటుందనే అంచనా వేస్తున్నారు.

కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ పాట టేకింగ్ కూడా ఓ రేంజిలో ఉండొచ్చని భావిస్తున్నారు.ఒకేసారి తెలుగు,హిందీ,తమిళం,మలయాళ భాషల్లో ఈ పాటను లాంచ్ చేసారు.సినిమాలో మూడు లేదా నాలుగు పాటలు ఉండొచ్చని మిగతా పాటలు కూడా ప్రముఖ కంపోజర్లతోనే చేయించుకుంటున్నారని సమాచారం.దాదాపు 300 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న "సాహో" ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15 న విడుదల కానుంది.

Related News