//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డార్లింగ్ ప్ర‌భాస్.. న‌యా ల‌వ్‌స్టోరీ.. ఇట్స్ రియ‌ల్ న్యూస్‌..!

Category : movies

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్.. బాహుబ‌లి చిత్రంతో ఒక్క‌సారిగా జాతీయ‌స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్‌ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా సినిమా సాహో. ర‌న్‌రాజార‌న్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా తీస్తుండటం విశేషం.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. జిల్ తో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ ప్రభాస్ కోసం ఓ క్రేజీ లవ్ స్టోరీ రాసుకున్నాడట. ప్రభాస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కూడా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తుండటం విశేషం. బాహుబలితో నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ సాహోని కూడా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా బీభత్సమైన క్రేజ్ తో ఈ సినిమా వస్తుంది. రాధాకృష్ణ ప్రభాస్ సినిమా మాత్రం రెబల్ స్టార్ కెరియర్‌లో క్రేజీ మూవీగా రానుందట. ప్రభాస్‌కు సరితూగే లవ్ స్టోరీతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. సాహో పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని టాక్‌.