//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డార్లింగ్ ప్ర‌భాస్ పెళ్లి.. వాట్ ఏ మ్యాట‌ర్.. ఇద్దరు టాప్ హీరోయిన్స్..?

Category : movies

టాలీవుడ్ పెళ్లి కాని ప్ర‌సాదుల్లో ముందున్న డార్లింగ్ ప్ర‌భాస్‌.. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా,ఇప్పటికీ ఆయన పెళ్లి మాత్రం చేసుకోలేదు. ప్ర‌భాస్‌కు త్వ‌ర‌లోనే పెళ్లి చేస్తామ‌ని.. ప్రస్తుతం ఆ ప‌నిలోనే ఉన్నామని పెద్ద‌నాన్న కృష్ణంరాజు చెప్పి కూడా సంవ‌త్సరం దాటిపోయింది. ప్ర‌భాస్ కూడా బాహుబ‌లి సినిమా పూర్తి అవ్వ‌గానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బాహుబ‌లి సినిమా పూర్తి చేసి సైలెంట్‌గా మ‌రో సినిమా కూడా ఒప్పుకుని షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేశారు.

ఇక హీరోయిన్ అనుష్క‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్తలు వ‌చ్చిన అవి రూమ‌ర్సే అని కొట్టి పారేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ ఇంటి అల్లుడు కాబోతున్నాడు అంటు వార్తలు వ‌చ్చాయి.ప్ర‌భాస్‌కు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుతురు నిహారిక‌ను ఇచ్చి వివాహం జ‌రిపిస్తున్నారనే వార్త‌లు రావ‌డంతో,అటు మెగా అభిమానులు,ఇటు ప్ర‌భాస్ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. ఈలోపే నిహారిక‌కు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేద‌ని మెగా ఫ్యామిలీ తెలిపింది.

ప్ర‌భాస్‌ ఊ.. అంటే చేసుకోడానికి బయట నుండే కాదు ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది హీరోయిన్స్ పోటీ పడతారు. ఇండియా వైడ్ పాపులర్ అయినా ప్రభాస్ కు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్కపోవడం ఆశ్చర్యకరమే. అయితే అసలు మ్యాట‌ర్ ఏంటంటే ప్ర‌భాస్ ఫ్యామిలీకి కుల పిచ్చి ఎక్కువ అని తెలుస్తోంది. ప్రభాస్ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజికవర్గం వారు ప్రభాస్ ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. ప్రభాస్ చేసుకుంటే క్షత్రియ కులానికి చెందిన అమ్మాయినే చేసుకోవాల‌ని క్షత్రియ సంఘాలు కృష్ణంరాజుపై ఒత్తిడి తెస్తున్నాయట. అందుకే ప్రభాస్ తనకు ఇష్టమైన ఇద్దరు హీరోయిన్స్‌ని పక్కన పెట్టేసాడని టాక్.

ఇదిలా ఉంటే తమ సామాజిక వర్గం నుంచి ప్రభాస్‌కి సూటయ్యే అమ్మాయి దొరకడం లేదట. కొన్ని పెద్ద కుటుంబాలాకి చెందిన అమ్మాయిలు ఉన్నారు కానీ సినిమా హీరోతో సంబంధాన్ని సదరు కుటుంబాలు కోరుకోవడం లేదట. కొన్ని సంబంధాలు ప్రభాస్ ఫ్యామిలీకి నచ్చడం లేద‌ట‌. ఈ మధ్యకాలంలో హీరోలు కుల, మతాలను అతీతంగా పెళ్లిల్లు చేసుకుంటున్నారు.కాని ప్ర‌భాస్ మాత్రం కుల పిచ్చితో ఇంకా ఊగుతున్నాడ‌ని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో ప్ర‌భాసే చెప్పాలి. ఇక అన్నీ కుదిరితే ఈ ఏడాదే ప్రభాస్ పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ ఇంకా ఏది సెటిల్ అయ్యే పరిస్థితిల్లో లేవు. కాబ్బటి ప్రభాస్ పెళ్లికి ఇంకా టైం పెట్టె అవకాశం ఉంది. అంటే ఇంకొన్నాళ్ళు ప్రభాస్ బ్యాచ్‌లర్‌ గా ఉండాల్సిందేన‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చిచుకుంటున్నారు.