Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఖండాంతరాలు దాటిన ప్రభాస్ క్రేజ్.....తమ అభిమాన హీరో ప్రభాస్ నీ చూడడం కోసం హైదరాబాద్ వచ్చిన జపనీయులు....!

Category : movies

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి’ సిరీస్‌ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఒక్కసారి గా దేశ,విదేశాల్లో ను మారు మ్రోగి పోయింది . ఈ సినిమా తరువాత కేవలం ఆయనకు అభిమానులు ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ చాలా మంది ఆయనకు అభిమానులైపోయారు. ముఖ్యంగా జపాన్‌లో ప్రభాస్‌కు విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. దీనికి పెద్ద ఉదాహరణే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ ఫొటో..... జపాన్‌కు చెందిన కొంత మంది అమ్మాయిలు హైదరాబాద్‌లోని ప్రభాస్ నీ చూడడానికి ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్లారు. ఇదంతా అభిమానులకు తెలియజేయడం కోసం వారంతా ప్రభాస్ ఇంటి మెయిన్ గేట్ ముందు వారంతా రకరకాల భంగిమలలో నిలబడి ఓ ఫొటోకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోనే సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

దర్శక దిగ్గజం జక్కన్న తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ సినిమాలను జపనీస్‌లోకి డబ్బింగ్ చేసి జపాన్‌లో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమాకు విశేష స్పందన లభించింది. అంతే కాకుండా ‘బాహుబలి’ టీమ్ స్వయంగా జపాన్ కి వెళ్లి మరీ ఈ సినిమా కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా నటుడు సుబ్బరాజ్ జపాన్‌లో పర్యటించి ‘బాహుబలి’కి మంచి ప్రచారం కల్పించారు. ఈ సిరీస్‌తో ప్రభాస్‌కు అక్కడ విపరీతంగా ప్యాన్స్ పెరిగిపోయారు. అయితే, జపాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఫ్యాన్స్ ప్రభాస్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారని, అక్కడ తీసుకున్న ఫొటో ఇదని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమాతో తెగ బిజీగా ఉన్నారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీలు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేసిన ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించారు. మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మందిర బేడీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Related News