//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభాస్ , అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు...!

Category : movies

తమిళ సినిమాలు తెలుగులో విడుదలై మంచి విజయాలు సాధిస్తూ ఉంటాయి. కాని తెలుగు సినిమాలు మాత్రం తమిళంలో విడుదలై విజయాలు సాధించినవి చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. అయితే అక్కడ తెలుగు సినిమాలకు క్రేజ్ ఉంది. కాని అది కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ అవ్వడం లేదు. దీనితో తెలుగు హీరోలు అక్కడ డైరెక్ట్ గా సినిమా చెయ్యాలని భావిస్తున్నారు. వారిలో ముఖ్యంగా మహేష్ బాబు...

అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటారు. మహేష్ బాబు స్పైడర్ సినిమా తమిళ దర్శకుడితోనే తెరకెక్కిన సంగతి తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య సినిమాను అక్కడ విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. వీరితో పాటు ప్రభాస్ కి కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అభిమానులను ఒక వార్త ఖుషి చేస్తుంది. ‘రాజా రాణి’, ‘తెరి’, ‘మెర్సల్‌’ సినిమాతో వరుస విజయాలు అందుకున్న..

తమిళ దర్శకుడు అట్లీ త్వరలో ఓ తెలుగు సినిమా తెరకెక్కించనున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘ఓ ప్రముఖ హీరోతో తెలుగులో భారీ సినిమా తీయబోతున్నా. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడండి’ అని అట్లీ పేర్కొన్నారు. అయితే అట్లీ తన సినిమాలో హీరోగా ప్రభాస్‌ లేదా అల్లు అర్జున్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.