//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జియోనీ స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రభాస్

Category : movies business

బాహుబలి చిత్రంతో దేశ, విదేశాలలో సంచలన నటుడిగా పేరొందిన ప్రభాస్  ఒక్కసారిగా జాతీయ స్థాయి నటుడుగా ఎదిగిపోయారు.  స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ జియోనీ ఇండియా ఇప్పుడు హీరో ప్రభాస్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. 

జియోనీ మొబైళ్ల ప్రచారకర్తల్లో ఇప్పటికే భారత క్రికెట్‌ సారథి విరాట్‌ కోహ్లితో పాటు అలియాభట్‌, శృతిహాసన్‌, దుల్కర్‌ సల్మాన్‌, దిల్జిత దోసాంజ్‌ లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రభాస్ ను తమ ప్రచారకర్తగా తీసుకోవడంతో శక్తివంతమైన బ్యాటరీ, మెరుగైన సెల్ఫీలకు మారుపేరుగా మంచి ఖ్యాతి గడించిన తమ సంస్థ జనబాహుళ్యంలోకి మరింతగా చొచ్చుకుపోగలుగుతుందని భావిస్తున్నట్టు జియోనీ సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్వింద్‌ వోరా ఆశాభావం వ్యక్తం చేశారు. 

భారతలో కార్యకలాపాలు ప్రారంభించిన ఐదు సంవత్సరాల్లోనే జియోనీ 1.25 కోట్ల మంది కస్టమర్లను సాధించగలిగింది. స్మార్ట్‌ఫోన్ల విభాగంతో త్వరిత గతిన వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌పై పట్టుకు చైనాకు చెందిన వివో, ఒప్పో, లెనోవో, జియోనీ పోటీ పడుతున్నాయి.