Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవర్ ఫుల్ కొమరం భీమ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన టాలీవుడ్ స్టార్స్ ?

Category : movies

నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరో స్థాయికి చేరుకున్న నందమూరి తారకరామారావు { JRNTR } పుట్టిన రోజు నేడు నందమూరి హరికృష్ణ ,షాలిని దంపతులకు మే 20 1983 జన్మించాడు.చిన్నతనంలోనే ‘బాలరామాయణం’తో మెప్పించిన ఆయన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘నిన్ను చూడాలని’ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా నిరాశ పరిచినా నటుడిగా ఎన్టీఆర్‌కు మంచిపేరు తెచ్చింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నం.1’ ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది.

ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం, బాద్‌షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత తదితర చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంతో రామ్‌చరణ్‌తో కలిసి మల్టీస్టారర్‌ చిత్రంలో తారక్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్టీఆర్‌కు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మా పవర్ ఫుల్ కొమరంభీమ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు ఈ ఏడాది మంచి జరగాలని ఆశిస్తున్నాం - ఆర్ఆర్ఆర్ టీమ్

అల్ రౌడీస్ తరపున హ్యాపీ బర్త్‌డే తారక్ అన్న- విజయ్ దేవరకొండ

హ్యాపీ బర్త్‌డే తారక్ సార్ - ప్రణీత

యంగ్ టైగర్ తారక్‌ కి హ్యాపీ అండ్ హెల్తీ హ్యాపీ బర్త్‌డే- స్టార్ మా

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ - వంశీ కాకా

మ్యాన్ ఆఫ్ ద మాస్ తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు - సురేశ్ ప్రొడక్షన్స్

‘జైలవకుశ’ లో మీతో నటించడం అద్భుతమైన అనుభవం. హ్యాపీ బర్త్‌డే సార్ - హంసా నందిని

మోస్ట్ పవర్‌ఫుల్ యాక్టర్ యంగ్ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు- సంపత్ నంది

నేను ఈ పవర్ హౌస్ నటుడు కోసం ఐస్ బర్గ్ యొక్క చిట్కా భావిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే తారక్ - త్రివిక్రమ్

మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే తారక్ గారు - అనిల్ రావిపూడి

Related News