Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బెజవాడ లోక్ సభ ఎన్నికల బరిలో వైసీపీ నుండి పీవీపీ ?

Category : politics state

ఎన్నికల షెడ్యూల్ రాకతో ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి . ఆయా పార్టీల్లో చేరికలు - రాజీనామాలతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది . ఎవరికి వారు వ్యూహాలకు పదును పడుతూ ముందుకు వెళ్తున్నారు . అభ్యర్థుల ఎంపికకు సమయం లేకపోవటంతో.. కసరత్తులు ముమ్మరం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరిగాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత అయిన పొట్లూరి వర ప్రసాద్ అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారు . జగన్ సమక్షంలో తీర్ధం తీసుకుంటున్నారు. బెజవాడ లోక్ సభ సీటు కన్ఫామ్ అయిన తర్వాతే వైసీపీలో జాయిన్ అవుతున్నట్లు సమాచారం. మార్చి 23న నామినేషన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు ప్రచారం కూడా మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారని సమాచారం .

ఏపీ రాజధాని విజయవాడ ఎంపీ సీటును గెలిచి తీరాలనే పట్టుదలతో పార్టీ వ్యూహాన్ని మార్చుకుంటూ వెళుతుంది. గెలుపు గుర్రాల కోసం, బలమైన అభ్యర్ధుల కోసం చూస్తోంది. అందులో భాగంగానే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. మార్చి 13వ తేదీ బుధవారం ఆయన లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. అనంతరం విజయవాడలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు.

నిన్నటి వరకు విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా దాసరి జై రమేష్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్టుగానే ఆయన పార్టీలో కూడా చేరారు. నామినేషన్ కూడా వేసేందుకు రమేష్ సిద్ధం అంటూ ప్రచారం జరిగింది. పార్టీ కూడా దాసరి అభ్యర్ధిత్వాన్ని ధృవీకరించింది. రాత్రికి రాత్రే దాసరి స్ధానంలో పొట్లూరి పేరు వచ్చింది. వాస్తవానికి పొట్లూరి గత ఎన్నికల్లోనే ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. అప్పటికి ఆయన పార్టీలో చేరలేదు. వైసీపీ అధినాయకత్వం ఇప్పటికే ఆయనతో చర్చలు జరుపుతోంది.