//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోస్టు కార్డుకి పూర్వవైభవం..

Category : editorial

కమ్యూనికేషన్ల రంగంలో రివల్యూషనరీ ఛేంజెస్ వచ్చినతర్వాత పోస్టల్ శాఖ సాధనాలు వాడటం మూలబడిపోయింది. ఓరకంగా ముతకపద్దతిగా తీసుకుంటున్నారన్నా అతిశయోక్తి కాదు. ఐతే ఇప్పటికికూడా అర్ధరూపాయి ఖర్చుతో అనుకున్న అడ్రస్ కి సమాచారం చేరవేయడం పోస్ట్ కార్డుతోనే సాధ్యం. వాట్సాప్, ఎస్ఎంఎస్ పద్దతులకు అలవాటు పడ్డ జనం కార్డు ముక్కని చీప్ గా చూడటం సహజమే ఇండియా పోస్ట్ ఇప్పటికీ ఏటా 104కోట్ల పోస్టు కార్డులు లక్ష్యాలకు చేర్చుతోందంటే పల్లెటూరి జనం దీన్ని మర్చిపోలేదని అనుకోవాల్సిందే..

పదహరేళ్ల క్రితం వరకూ పావలా ఉండే పోస్టుకార్డు అర్ధరూపాయికి పెంచారు. ఇప్పుడు మళ్లీ ఈ రేటు కాస్త పెంచాలనే ప్రతిపాదన ఇండియాపోస్ట్ ఉన్నతాధికారులు ముందు ఉంది. ఎందుకంటే గత ఏడాది పోస్టుకార్డుల అమ్మకాల ద్వారా వసూలు అయింది రూ.13వేలకోట్ల రూపాయలు, అయితే ఖర్చైంది మాత్రం రూ. 19వేలకోట్లు..మరి ఇఁత భారీగా లోటు ఉన్నప్పుడు రేటు పెంచాలనే ఆలోచననిఎవరూ పెద్దగా పట్టించుకోరు. ప్రతి పోస్టు కార్డు డెలివరీ చేయడానికి రూ.9.05పైసలు ఖర్చవుతుందట. ఇది ఈ ఏడాదికి వచ్చేసరికి పదిరూపాయలకు పెరుగుతోంది. అంటే పోస్టు కార్డు వాడకం పెరిగే కొద్దీ నష్టాలూ పెరగకతప్పని పరిస్థితి..అందుకే పోస్ట్ కార్డ్ వాడకాన్ని పరోక్షంగా పోస్టల్ శాఖ ప్రోత్సహించడం లేదనుకోవచ్చు..

ఇంత నష్టం వాటిల్లుతుండటంతో..రేటు పెంచితే బావుండనే ప్రతిపాదన వచ్చుండొచ్చు..దీనికోసం ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం -1898కి సవరణ చేయాలని తెలుస్తోంది. పోస్టు కార్డు రేటు పెంచినా జనం ఆదరించవచ్చు కానీ..పోస్టుకార్డు అనేది జనం సెంటిమెంట్ కి సంబంధించిన అంశంగా కూడా చూడాలి. ఎందుకంటే గతంలో టెలిగ్రామ్ రద్దు చేసినప్పుడు కూడా చాలామంది ఆ ప్రసారసాధనంతో తమ కి ఉన్న అనుబంధం, అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. టెలిగ్రామ్ రద్దు వద్దంటూ విజ్ఞప్తులు చేసారు ఐనా అది ఆగలేదనుకోండి..ఇప్పుడు నష్టాలు తెచ్చిపెడుతున్నపోస్ట్ కార్డ్ అసలు రద్దు చేయడం కంటే రేటు పెంచడమనేది పెద్ద విషయంగా భావించరు. డిజిటల్ యుగంలో బతుకుతున్నాం ఇంకా పోస్టు కార్డులేంటనే వారికి భారతదేశంలోని గ్రామాల్లో ఇప్పటికీ పోస్టుకార్డులు వాడుతున్నారనే అంశం కూడా గుర్తుంచుకోవాలి. సన్నిహితులు కుటుంబసభ్యులు దూరతీరాలనుంచి స్వహస్తాలతో రాసి అక్షరాల రూపంలో ప్రోది చేసిన భావాలు, వాటిని తడిమి చూసి భావోద్వేగాలకు లోనుకావడం అందరికీ అనుభవైకవేద్యమే. అందుకే పోస్ట్ కార్డ్ ఆగిపోకూడదని సామాన్య జనం కోరుకుంటున్నారు.

Related News