//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ క్రికెట్ అభిమానులకు మరో బంపరాఫర్ ప్రకటించిన పూనమ్ పాండే..

Category : sports

పూనమ్ పాండే ఈ పేరు తెలియని యువతరం లేరంటే అతిశయోక్తి కాదు.అప్పట్లో మన దేశం ప్రపంచ కప్ గెలిస్తే..న్యూడ్ షో చేస్తా అని చెప్పి సంచలనం రేపింది. ఆ దెబ్బతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన పూనమ్ పాండే..తనకు తోచినపుడల్లా.. తన అందమైన అందాల ఫోటోలతో అభిమానులను కనువిందు చేస్తూనే ఉంది. ఆల్రెడీ ఈ భామ ‘లేడీ గబ్బర్ సింగ్’ ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ అనే సినిమాలతో బాలీవుడ్‌లో కాస్తా హడావిడి చేసినా ఏమి కలిసిరాలేదు. ఎపుడు వివాదాస్పద ప్రకటనలతో పాటు..పర్సనల్ ఫోటోలు, వీడియోలతో కూడా వార్తల్లో ఉంటుంది పూనమ్ పాండే.

సామాజిక మాధ్యమాల్లో చాలా చురుక్కే ఉండే పూనమ్ పాండే అపుడపుడు తన పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ భామ.. ఆది వారం జరిగిన భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మన దేశం గెలిచిన సందర్భంగా మరోసారి బ్లాక్ డ్రెస్‌లో బెడ్ మీద పడుకున్న ఫోజుతో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ముందు వరల్డ్ కప్‌లో భారత్ ఆడే ప్రతి మ్యాచ్‌లో మన దేశం విజయం సాధిస్తే.. ఒక్కో మ్యాచ్ సందర్భంగా తన అద్భుతమైన సెమి న్యూడ్ ఫోటోను పోస్ట్ చేస్తా అని చెబుతోంది. ఏమైనా పూనమ్ పాండే పోస్ట్ చూసిన అభిమానులు.. ఈ రకంగానైనా భారత్ ..ప్రతి మ్యాచ్‌లో గెలిస్తే.. అదో ఆనందం.. మరోవైపు పూజా పాండే అందాలు చూస్తూ డబుల్ ఆనందం పొందవచ్చని అనుకుంటున్నారు.