Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ఒక్క సినిమాతో .....బాలీవుడ్ లో పాగా వేయనున్న పూజ హెగ్డే.

Category : movies

టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూజ హెగ్డే.తనదైన అందం, అభినయంతో మనసును ఇట్టే తన వైపు తిప్పుకో గలిగిన ఈ నటి. తన మొదటి సినిమా ముకుంద అంతగా ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోవడంతో బాలీవుడ్ వెళ్లిన ఈ బ్యూటీ.అక్కడ హృతిక్ రోషన్ వంటి టాప్ స్టార్ తో నటించే అవకాశం కొట్టేసింది.వీరిద్దరి కలయిక లో వచ్చిన భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రంగా 'మొహంజొదారో' తెరకెక్కింది. అయితే ఆమెకు ఈ భారీ బడ్జెట్ చిత్రం కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇలా ఆ రెండు సినిమాలు పరాజయం కావడంతో ...ఆమెకి అక్కడ అవకాశాలు రాకపోవడం తో వెను దిరిగిన ఆమెకు టాలీవుడ్ లో 'దువ్వాడ జగన్నాథం'తో గ్లామరస్ హీరోయిన్ గా సత్తా చాటింది.

దాంతో ఆమెకి జూనియర్ ఎన్టీఆర్ "అరవింద సమేత వీర రాఘవ" సినిమా లో అవకాశం దక్కింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడం తో ఇక ఈ అమ్మడుకి టాలీవుడ్ సినిమాలు బాగా కలిసొచ్చాయి.ఆ వెంటనే పూజకి టాలీవుడ్ టాప్ స్టార్స్ అయినా మహేశ్ బాబు, ప్రభాస్ ల సరసన నటించే వరుస అవకాశాలు వచ్చాయి.ఇక ఈ అమ్మడికి టాలీవుడ్ లో తిరుగు లేదు అని అనుకుంటూ ఉండగా ఆమెకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.హిందీ లో సూపర్ హిట్ సీక్వెల్స్ లో ఒకటైన 'హౌస్ ఫుల్- 4'లో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోన్న సాజిద్ నడియాడ్ వాలాకి పూజా నటన బాగా నచ్చిందట. దాంతో ఆయన పూజకి తన బ్యానర్లో మరో రెండు సినిమాల్లో నటించే అవకాశాన్ని కల్పించడంట.ఇలాంటి లక్కీ ఛాన్స్ తరువాత ఆమెకు మరిన్ని బాలీవుడ్ అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.