//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం రేసు నుండి పొన్నాల అవుట్ ... ఎందుకంటే

Category : politics

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది Congress పార్టీ పరిస్థితి. ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు జరగా లేదు. ఎన్నికలలో ముందుకు పోలేదు. గెలవలేదు. అధికారంలోకి రాలేదు. కానీ సీఎం అభ్యర్థి తామే కావాలని కొట్టుకు చస్తున్నారు. కాంగ్రెస్ కు ఉన్న అత్యంత చెడ్డ లక్షణం ఇది. ఆ పార్టీ ని ఎవరు నాశనం చెయ్యాల్సిన అవసరం లేదు. వాళ్ళ చెయ్యి వాళ్ళ నెత్తినే పెట్టుకునే భస్మాసుర లక్షణం ఆ నాయకులకు ఉంది .Ponnala Lakshmaiah out from CM Race

Congress పార్టీ రాజకీయాలు చాలా విలక్షణంగా ఉంటాయి. ప్రత్యర్థులను మట్టి కరిపించేలా వ్యూహ రచన చేయటంలో దిట్ట అని అందరు అంటుంటారు. అధిష్టానం ఆమోదం లేనిదే పార్టీలో ఏ నిర్ణయం ముందుకు సాగదు, పార్టీ గెలుపు కోసం సొంత పార్టీ సభ్యులపై సైతం వేటు వేయడానికి సిద్దపడే పార్టీ. దీనికి ఆ నాటి నెహ్రు నుండి ఈ నాటి నాయకుల వరకు ఎవరు మినహాయింపు కాదు. అధిష్టానం అండదండలతో ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకులూ చాలా మంది ఉన్నారు, అందుకే పార్టీలో నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ముందస్తు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూడా అలంటి వ్యూహ రచనే జరుగుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.Ponnala Lakshmaiah out from CM Race

ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు తమ ప్రత్యర్థి గా భావిస్తున్న వారిని రేసులో నుండి తప్పించేందుకు వ్యూహ రచన మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. మనకు తెరాస గద్దె దిగటం ముఖ్యం, అందుకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్దపడండి అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇప్పటికే రేణుక చౌదరి, జానారెడ్డి వంటి సీనియర్ నాయకులూ “మేము త్యాగాలకు సిద్దమే”అంటూ ప్రకటించారు. దీనిని”ఉత్తమ”మైన రాజకీయంగా గాంధీ భవన్ లో అందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ వ్యూహ రచనలో భాగంగానే పొన్నాల వంటి సీనియర్ నేతను తన నియోజకవర్గం నుండి కాకుండా వేరే నియోజకవర్గం నుండి పోటీ చేయించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం మహాకూటమిలో భాగస్వామి అయిన టీజెఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం కు జనగాం సీటు కేటాయించబోతున్నారట. బీసీ కులానికి చెందిన వారే ముఖ్యమంత్రి కావాలని ఆ వర్గం వారు డిమాండ్ చేస్తుండటంతో పొన్నాలను సీఎం రేసు నుండి తప్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకుల వ్యూహంగా చెప్తున్నారు. తన సొంత నియోజక వర్గం అయితే గెలిచే అవకాశం వుంటుంది కానీ వేరే చోట ఛాన్స్ తక్కువ కానీ సీఎం అభ్యర్థి ఎక్కడైనా గెలవాలనే లాజిక్ చెప్పి పొన్నాలకు చెక్ పెట్టె ఆలోచనలో ఉన్నారని టాక్.Ponnala Lakshmaiah out from CM Race

Related News