జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్..పోలో జీటీ హ్యాచ్‌బ్యాక్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా మళ్లీ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు గరిష్ఠంగా రూ.9.21 లక్షలకు లభించనున్నది. లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ కారు పెట్రోల్, డీజిల్ రకాల్లో లభ్యమవనున్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన కారు ధరను రూ.9.11 లక్షలుగాను, 1.5 లీటర్ల డీజిల్ రూపొందించిన వాహనం రూ.9.21 లక్షలుగా నిర్ణయించింది. గతంలో ప్రవేశపెట్టిన దాంతో పోలిస్తే ఈ సరికొత్త ఎడిషన్ కారు లోపలి భాగంలో టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసినట్లు ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు సేల్స్ ఇండియా ఎండీ థిర్రీ లెస్పియక్యూ తెలిపారు.