//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కర్ణాటకలో ముదురుతోన్న రాజకీయసంక్షోభం .. బీజేపీ కుట్రపై ఆడియో క్లిప్ కలకలం

Category : politics state

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. బడ్జెట్ సమావేశాల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు సీఎం కుమార స్వామికి , కర్ణాటక కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది. రెండ్రోజుల కింత్రం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మాకొడుతుండడం బీజేపీకి ఆయుధంగా మారింది.

ఎమ్మెల్యేల గైర్హాజరీతో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మైనార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ను అడ్డుకుంటామని శపథం చేస్తున్నారు. దీంతో ఇవాళ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోననే ఉత్కంఠనెలకొంది. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెలు హాజరుకాకపోవడంపై ఆగ్రహించిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. బడ్జెట్ సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాలని ఆదేశించింది. అటు సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిందంటున్న బీజేపీ నేతలు ఈ అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.

మా ఎమ్మెల్యేలను లాక్కోనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు కర్ణాటక సీఎం కుమారస్వామి. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడటం లేదని ఆయన చెప్పారు. మోడీ ఒకవైపు అసత్యాలు చెబుతూనే మరోవైపు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వీటన్నింటిపై ఆధారాలతో సహా రుజు చేస్తామని చెప్పారు. మా ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరచూపి ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అసత్యాల ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందని అన్నారు. ఎమ్మెల్యేకు డబ్బు ఎరవేస్తున్న అంశంపై ఆడియో టేపును కుమారస్వామి విడుదల చేశారు. దీంతో ఇప్పుడు వివాదం మరింత ముదిరింది. ఇక ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపధ్యంలో కర్ణాటక రాజకీయాలు ఏ రూపు తీసుకుంటాయో మరి.

Related News