నటి శ్రీదేవి మరణం మిస్టరీగా మారింది. మొదట ఆమె గుండెపోటుతో చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆమె బాత్‌టబ్‌లో నీట మునిగి చనిపోయినట్టు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఆమె రక్త నమూనాలో ఆల్కహాల్ ఉన్నట్టు దుబాయ్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.
దీంతో శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోయిందా లేక ఆత్మహత్య చేసుకుందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో శ్రీదేవి కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు. దీంతో శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు దేశం విడిచి వెళ్లొద్దని ఆయన దుబాయ్ పోలీసులు ఆదేశించారు.
బోనీకపూర్‌ను పోలీసులు సుమారు మూడు గంటల పాటు విచారించినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. బోనీకపూర్ కాల్ డేటాను పరిశీలించారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి భౌతికకాయం మంగళవారం భారత్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా శ్రీదేవి మరణం దేశ వ్యాప్తంగా సంచలమైంది. ఎక్కడ చూసినా ఆమె మృతిపైనే చర్చ సాగుతోంది.